Type Here to Get Search Results !

Sports Ad

గుండెపోటుతో జడ్పీ ఛైర్మన్ కన్నుమూత ZP Chairman kusuma jagadish died of heart attack

 



గుండెపోటుతో జడ్పీ ఛైర్మన్ కన్నుమూత


- ములుగు జడ్పి చైర్మన్ మృతిపట్ల సునీతారెడ్డి శ్రద్ధాంజలి
- తెలంగాణ ఏర్పాటులో సాహిత్యంది ముఖ్య భూమిక
- కవులు, కళాకారులతో ప్రజా చైతన్యం
-జడ్పి చైర్ పర్సన్ పట్నం సునీతారెడ్డి
- జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి 

వికారాబాద్ Vikarabad News భారత్ ప్రతినిధి : ములుగు జడ్పీ ఛైర్మన్ కుసుమ జగదీశ్ గుండెపోటుతో మృతిచెందారు. కాసేపటి క్రితం ఆయన గుండెపోటుకు గురవ్వగా, హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాసేపటి క్రితం ఆయన మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. జగదీష్ మృతిపట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.తెలంగాణ ఉద్యమంలో జగదీశ్ చురుకైన పాత్ర పోషించారని సీఎం కొనియాడారు.



ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ అకాల మృతిపట్ల వికారాబాద్ జడ్పి చైర్ పర్సన్ పట్నం సునీతారెడ్డి గారు  శ్రద్ధాంజలి ఘటించారు. ఆదివారం వికారాబాద్ లో జరిగిన దశాబ్ది ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న సునీతారెడ్డి, అధికారులు ప్రజా ప్రతినిధులు మౌనం పాటించి నివాళ్ళు అర్పించారు వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.



దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రోజున వికారాబాద్ లో జరిగిన సాహితీ దినోత్సవం కవి సమ్మేళనానికి సునీతారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సంధర్బంగా సునీతారెడ్డి మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర ఏర్పాటులో సాహిత్యం ముఖ్య పాత్ర పోషించిందని జడ్పి చైర్ పర్సన్ పట్నం సునీతారెడ్డి అన్నారు. కవులు సాహిత్యంతో కళాకారులు ఆటపాటలతో తెలంగాణా ప్రజానీకాన్ని చైతన్యం చేశారని కొనియాడారు. తెలంగాణా ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ సాహితి, సంస్కృతిక వికాసం వచ్చిందన్నారు. ఈ సందర్భంగా కవులను, సాహిత్య వేత్తలను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ నారాయణ రెడ్డి, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం...
* గుండెపోటుతో జడ్పీ ఛైర్మన్ కన్నుమూత ఇక్కడ క్లిక్ చేయండి
* బహుజన్ సమాజ్ పార్టీలోకి యువత ఇక్కడ క్లిక్ చేయండి
* హీరోయిన్,మంత్రి రోజాకు అస్వస్థత ఇక్కడ క్లిక్ చేయండి 
* తెలంగాణ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం? ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies