1వ తరగతి నుండి 5వ తరగతివరకు రెసిడెన్షియల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
* జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి
* అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలి
* పూర్తి వివరాలకు 9908690240 కి సంప్రదించండి
వికారాబాద్ Vikarabad News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిలాల్లో బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో 1వ తరగతి నాన్ రెసిడెన్షియల్, 5వ తరగతిలో రెసిడెన్షియల్ ప్రవేశం కోసం అర్హులైన షెడ్యూల్డ్ కులాల విద్యార్థినీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.అభ్యర్థులు వికారాబాద్ జిల్లాకు చెందిన వారై ఉండాలన్నారు. ఒక కుటుంబంలో ఒక విద్యార్థికి మాత్రమే ప్రవేశం ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాకు 38 నాన్ రెసిడెన్షియల్, 38 రెసిడెన్షియల్ సీట్లు కేటాయించినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంత షెడ్యూల్డ్ కులాల కుటుంబాలవారి వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు,పట్టణ ప్రాంతాలవారి వార్షిక ఆదాయం రూ.2లక్షలకు మించకుండా ఉండాలన్నారు.విద్యార్థులు 1 జూన్ 2017 - 31 మే 2018 మధ్య జన్మించినవారు అర్హులని తెలిపారు.దరఖాస్తు ఫారాలను జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కార్యాలయం, రూం నం.ఎఫ్-10, కొత్త కలెక్టరేట్ కార్యాలయంలో పొందాలన్నారు.సరైన ధ్రువపత్రాలు జత చేసి ఈ నెల 15 వరకు అందజేయాలన్నారు.పూర్తి వివరాలకు 9908690240ను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.