Type Here to Get Search Results !

Sports Ad

ఈ నెల 14 తేదీన చంద్రయాన్‌-3 ప్రయెగం Chandrayaan-3 launch on 14th of this month

 

  ఈ నెల 14 తేదీన చంద్రయాన్‌-3 ప్రయెగం 


* శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌

* మధ్యాహ్నం 2.35 గంటలకు ప్రయెగం 

* చంద్రయాన్‌-3 రోవర్‌ జాబిలిపై పాదం

* ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌,శాస్త్రవేత్తలు


బెంగళూరు Bangalore News భారత్ ప్రతినిధి : చంద్రయాన్‌-3 ప్రయోగాన్ని ఈ నెల 14 తేదీన చేపట్టనున్నట్లు ఇస్రో గురువారం రోజున ప్రకటించింది.తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లో ఈ మేరకు ఏర్పాట్లు చేపట్టారు. ఈ నెల 13న ప్రయోగం చేపట్టాలని ముందుగా భావించినా లాంచ్‌ విండో అనుకూలతను పరిశీలించి 14వ తేదీ మధ్యాహ్నం 2.35 గంటలకు ప్రయోగ సమయాన్ని ఖరారు చేశారు. బుధవారం ఎల్‌వీఎం-3పీ4 వాహక నౌకతో చంద్రయాన్‌-3 ఉపగ్రహాన్ని అనుసంధానించిన శాస్త్రవేత్తలు.

  పరిస్థితులు అనుకూలిస్తే ఆగస్టు 23న చంద్రయాన్‌-3 రోవర్‌ జాబిలిపై పాదం మోపే అవకాశం ఉందని ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ తెలిపారు. గురువారం బెంగళూరులో నిర్వహించిన ‘జి-20 స్పేస్‌ ఎకానమీ లీడర్స్‌ మీట్‌’లో ఆయన ఈ మేరకు వెల్లడించారు. గత తొమ్మిదేళ్లలో భారత అంతరిక్ష రంగం విప్లవాత్మక సంస్కరణలతో దూసుకెళ్లిందని ఈ సదస్సులో మాట్లాడుతూ అంతరిక్షశాఖ సహాయమంత్రి జితేంద్ర సింగ్‌ పేర్కొన్నారు. గత మూడేళ్లలో ఈ రంగంలో 140కి పైగా అంకురాలు ఏర్పాటు అయ్యాయన్నారు.సదస్సులో విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి రాజ్‌కుమార్‌ రంజన్‌ సింగ్‌, అంతరిక్ష శాఖ కార్యదర్శి అమితాబ్‌ కాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం చదవండి... 
* పోస్ట్ ఆఫిసుల్లో 12వేల పోస్టులు ఇక్కడ క్లిక్ చేయండి 
* ఈ నెల 14 తేదీన చంద్రయాన్‌-3 ప్రయెగం ఇక్కడ క్లిక్ చేయండి 
* నేడు ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల ఇక్కడ క్లిక్ చేయండి 
* నేడు పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల ఇక్కడ క్లిక్ చేయండి 
* పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో పెళ్ళికి సిద్ధం ? ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies