జులై 3 నుంచి మోటార్‌సైకిళ్లు ధరలు పెరుగనున్నాయి
దిల్లీ Delhi News భారత్ ప్రతినిధి : జులై 3 నుంచి మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల ధరలను దాదాపు 1.5 శాతం పెంచనున్నట్లు హీరో మోటోకార్ప్ ప్రకటించింది. ముడివస్తువుల ధరలు పెరగడంతో పాటు పలు కారణాలను ఇందుకు పేర్కొంది.పలు మోడళ్లు, మార్కెట్ల ఆధారంగా తాజా పెంపు ఉంటుందని తెలిపింది. వినియోగదారులపై ప్రభావం తక్కువగా ఉండేందుకు వినూత్న రుణ పథకాలను కొనసాగిస్తామని హీరో మోటోకార్ప్ వెల్లడించింది.ఈ ఏడాది ఏప్రిల్‌లో కూడా కంపెనీ ధరలను దాదాపు 2 శాతం ప్రియం చేసింది.