Type Here to Get Search Results !

Sports Ad

గ్రూపు 4 కు పకడ్బందీ ఏర్పాట్లు నేడు 2878 కేంద్రాల్లో పరీక్షలు Armed arrangements for Group 4 examination in 2878 centers today



గ్రూపు 4 కు పకడ్బందీ ఏర్పాట్లు నేడు 2878 కేంద్రాల్లో పరీక్షలు 

 హైదరాబాద్‌ Hyderabad News : రాష్ట్రంలో 8,180 గ్రూప్‌-4 సర్వీసుల ఉద్యోగాల భర్తీకి జులై 1న శనివారం రాతపరీక్ష నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది.ఈ పరీక్షకు 9.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రి వరకు 8.81 లక్షల మంది వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఈ పరీక్ష కోసం టీఎస్‌పీఎస్సీ రాష్ట్రవ్యాప్తంగా 2,878 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది.అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు ఫొటోగుర్తింపు కార్డు తప్పనిసరి తీసుకెళ్లాలని స్పష్టం చేసింది. పరీక్ష కేంద్రాలుగా గుర్తించిన పాఠశాలలకు పాఠశాల విద్యాశాఖ సెలవు ప్రకటించింది. హాల్‌టికెట్‌ ప్రశ్నపత్రం నంబరు సరిగా రాయకున్నా, బబ్లింగ్‌ చేయకపోయినా, బ్లూ లేదా బ్లాక్‌ బాల్‌పాయింట్‌ పెన్‌ కాకుండా ఇంక్‌పెన్‌, జెల్‌పెన్‌, పెన్సిల్‌ ఉపయోగించినా ఓఎంఆర్‌ పత్రం చెల్లుబాటు కానిదిగా గుర్తిస్తామని స్పష్టం చేసింది.


గ్రూప్‌-3లో అదనంగా 13 పోస్టులు 

‘గ్రూప్‌-3’ ఉద్యోగ ప్రకటనలో అదనంగా మరో 13 పోస్టులు చేరాయి. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 1,388కి చేరింది. తొలుత 1,363 పోస్టులతో గత ఏడాది డిసెంబరు 30న ప్రకటన వెలువడింది. అనంతరం బీసీ గురుకుల సొసైటీలో 12 పోస్టులు అదనంగా చేర్చారు. తాజాగా నీటిపారుదలశాఖ ఈఎన్‌సీ కార్యాలయంలో 13 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు గుర్తించి చేర్చారు.

మరిన్ని వార్తల కోసం.... 
* నేటి నుంచి మూడో విడత రిజిస్ట్రేషన్ ప్రారంభం ఇక్కడ క్లిక్ చేయండి 
* రానున్న నాలుగు రోజుల్లో భారీ వర్షాల హెచ్చరి ఇక్కడ క్లిక్ చేయండి
* గ్రూప్‌ 4 పరీక్ష రాస్తూ సెల్‌ఫోన్‌తో పట్టుపడ్డ అభ్యర్థి ఇక్కడ క్లిక్ చేయండి
* గ్రూపు 4 కు పకడ్బందీ ఏర్పాట్లు నేడు 2878 కేంద్రాల్లో పరీక్షలు ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies