Type Here to Get Search Results !

Sports Ad

గ్రూప్‌ 4 పరీక్ష రాస్తూ సెల్‌ఫోన్‌తో పట్టుపడ్డ అభ్యర్థి A candidate had trouble with his cell phone while writing the Group 4 exam


 గ్రూప్‌ 4 పరీక్ష రాస్తూ సెల్‌ఫోన్‌తో పట్టుపడ్డ అభ్యర్థి 

హైదరాబాద్ Hyderabad News : గ్రూప్‌ -4 పరీక్ష రాస్తూ సెల్‌ఫోన్‌తో ఓ అభ్యర్థి పట్టుబడ్డాడు. సరూర్‌నగర్‌లోని సక్సెస్‌ కళాశాలలో ఈ ఘటన జరిగింది. పరీక్ష ప్రారంభమైన అరగంట తర్వాత ఇన్విజిలేటర్‌ గుర్తించి అభ్యర్థి నుంచి ఫోన్‌ తీసుకుని సీజ్‌ చేశారు.మాల్‌ ప్రాక్టీస్‌ కింద అభ్యర్థిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  ఈ సంఘటన మినహా జిల్లా వ్యాప్తంగా ఉదయం స్టేషన్‌లో జరిగిన గ్రూప్-4  పేపర్-1 పరీక్ష ప్రశాంతంగా జరిగిందని కలెక్టర్‌ తెలిపారు.రాష్ట్రంలో గ్రూప్-4 పరీక్ష ప్రశాంతంగా కొనసాగుతోంది. 8,180 ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన ఈ పరీక్షకు 9,51,321 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు జనరల్ స్టడీస్ పరీక్ష రాశారు. మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు సెక్టరేరియల్ ఎబిలిటీస్ పరీక్షను అభ్యర్థులు రాయనున్నారు. కొన్ని చోట్ల వివిధ కారణాలతో అభ్యర్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకోలేకపోవడంతో నిర్వాహకులు పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. దీంతో వారు నిరాశతో వెనుదిరిగారు.

మరిన్ని వార్తల కోసం.... 
* నేటి నుంచి మూడో విడత రిజిస్ట్రేషన్ ప్రారంభం ఇక్కడ క్లిక్ చేయండి 
* రానున్న నాలుగు రోజుల్లో భారీ వర్షాల హెచ్చరి ఇక్కడ క్లిక్ చేయండి
* గ్రూప్‌ 4 పరీక్ష రాస్తూ సెల్‌ఫోన్‌తో పట్టుపడ్డ అభ్యర్థి ఇక్కడ క్లిక్ చేయండి
* గ్రూపు 4 కు పకడ్బందీ ఏర్పాట్లు నేడు 2878 కేంద్రాల్లో పరీక్షలు ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies