తాండూరులో ప్రశాంతంగా ముగిసిన గ్రూఫ్-4 పరీక్ష
* తాండూరులో మొత్తం 19 పరీక్షా కేంద్రాలు
* బందోబస్తు నిర్వహించిన పోలీసులు
* కేంద్రాలను పరిశీలించిన అడిషనల్ ఎస్పీ
తాండూర్ Tandur News భారత్ ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వ నిర్వహిస్తున్న గ్రూప్-4 పరీక్ష వికారాబాద్ జిల్లా తాండూరులో ప్రశాంతంగా ముగిసింది. శనివారం ఉదయం పోలీసు బందోబస్తు మద్య పరీక్షలు జరిగాయి. మధ్యాహం్న మరో పరీక్షకు అధికారులు ఏర్పాట్లు చేశారు. గ్రూప్-4 పరీక్షను దృష్టిలో ఉంచుకుని తాండూరులో మొత్తం 19 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో రెండు, చైతన్య జూనియర్ కళాశాల, సింధూ బాలికల జూనియర్ కళాశాల, సిద్ధార్థ జూనియర్ కళాశాల, ప్రభుత్వ పాఠశాలలు, మైనార్టీ,గురుకుల పాఠశాలలోని కేంద్రాలలో దాదాపు 5 వేల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరువుతున్నట్లు అధికారులు వెల్లడించారు. పట్టణంలోని అన్ని కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ను పక్కాగా అమలు చేశారు. వికారాబాద్ జిల్లా అడిషనల్ ఎస్పీ మరళీధర్ పట్టణంలోని అన్ని పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. ఉదయం జరగాల్సిన పరీక్షలకు 15 నిమిషాల ముందే లోపలికి అనుమతించారు.కొన్ని ప్రదేశాలలో కొన్ని కారణాల వాళ్ళ కొంత మంది విద్యార్థులు ఆలస్యంగా రావడంతో అనుమతించలేదు.