9మంది సీఐల బదిలీలు ఉత్తర్వులు జారీ
హైదరాబాద్ Hyderabad News : జులై 02 ఆదివారం 9మంది సీఐలను బదిలీ చేస్తూ సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసారు. చేవెళ్ల సీఐగా ఉన్న వెంకటేశ్వర్లును ఆమన్ గల్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. శంకర్ పల్లి డీఐని చేవెళ్ల సీఐగా నియమించారు. సైబర్ క్రైమ్స్‌లో ఉన్న నాగేశ్వర్ రావును ఆల్వాల్ ట్రాఫిక్ సీఐగా బదిలీ చేసారు. మొయినాబాద్ సీఐగా ఉన్న లక్ష్మి రెడ్డిని షాద్ నగర్ రూరల్ సీఐగా ట్రాన్స్‌ఫర్ చేసారు. అక్కడ ఉన్న సత్యనారాయణను క్రైమ్స్ వింగ్‌కు ట్రాన్స్‌ఫర్ చేసారు. షాబాద్ సీఐ గురువయ్యను క్రైమ్స్ వింగ్‌కు బదిలీ చేసారు. ఇక, సైబర్ క్రైమ్స్‌లో ఉన్న భూపాల్ శ్రీధర్‌ను శంషాబాద్ ఎస్బీకి ట్రాన్స్‌ఫర్ చేసారు. అక్కడ ఉన్న విజయ్ కుమార్‌ను రాజేంద్రనగర్ ఎస్బీకి బదిలీ చేసారు.సీఏటీలో ఉన్న యాదయ్య గౌడ్‌ను షాబాద్ సీఐగా నియమించారు.