చట్టం ముందు అందరూ సమానులే
* జీవన్గి గ్రామంలో న్యాయ విజ్ఞాన సదస్సు
* చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
* తాండూర్ సివిల్ కోర్టు జడ్జ్ శివ లీల
* పాల్కొన్న అధికారులు,గ్రామస్థులు
బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం జీవన్గి గ్రామం గాంధీ చౌరస్తాలో న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో న్యాయ విజ్ఞాన సదస్సుకు ముఖ్య అతిథిగా తాండూరు సివిల్ కోర్ట్ జడ్జ్ శివలీల పాల్కొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు చట్టాలపై అవగాహన తీసుకరాడానికే న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నారు.ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, ప్రభుత్వం చేసే చట్టాలపై ప్రజలకు అవగాహన కలిగి ఉండాలి. లోక్ అదాలత్ మేఘలోకదాలత్ ద్వారా రాజికి వీలును క్రిమినల్ కేసులతో పాటు అన్ని సివిల్ కేసులను వాయిదాలతో నిమిత్తం లేకుండా ఇరువర్గాల పిలిపించి కేసు కొట్టి వేయడం అదేవిధంగా ఆడబిడ్డలకు చిన్న వయసులోనే పెండ్లి చేయడం నేరం ఆడబిడ్డకు 18సంవత్సరాలు నిండి ఉండాలి. పురుషులకు 21వ సంవత్సరం నిండి ఉండాలని పేర్కొన్నారు.చట్టాల గురించి తెలియకనే ప్రజలు నేరాలు చేస్తున్నారని తెలిపారు.ప్రతి ఒక్కరు చట్ట పరిధిలోనే జీవించాలన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కే.నవనీత రెడ్డి, ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్,జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి,బషీరాబాద్ సర్పంచ్ పి.ప్రియాంక,ఎన్డీ వేణుగోపాల్,తాండూరు న్యాయవాదులు చంద్రశేఖర్, రవికు మార్,రామ్ రెడ్డి,శ్రీనివాస్,చంద్రశేఖర్ రెడ్డి, విశ్వనాథం,సుదర్శన్,గ్రామ పెద్దలు మాణిక్ రెడ్డి,మునీందర్ రెడ్డి,వీరారెడ్డి, నర్సిరెడ్డి,శ్రీనివాసరెడ్డి,నరేందర్ రెడ్డి, యువకులు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.