ANM ఉద్యోగాల కోసం (అవుట్ సోర్సింగ్) దరఖాస్తులు
తాండూర్ Tandur News భారత్ ప్రతినిధి : ఎఎన్ఎం ఉద్యోగాల కోసం అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేయడానికి దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.వికారాబాద్ జిల్లాలో ఉన్న గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, ప్రీ-మెట్రిక్ మరియు పోస్ట్-మెట్రిక్ హాస్టళ్లలో 2023-24 సంవత్సరానికి ANM ఉద్యోగాల కోసం అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేయడానికి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి.
1. పోస్ట్ పేరు ANM (అవుట్ సోర్సింగ్ ప్రతిపాదన)
2. దరఖాస్తు విధానం ఆన్ లైన్ వెబ్ సైట్ : http://tsobmms.cgg.gov.in
3. వయస్సు 18-44 సంవత్సరాలు
4. అర్హత & అనుభవం దరఖాస్తుదారు SSC/Inter ఉతీర్ణులై ఉండి, ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్య సంస్థలో 18నెలల ANM శిక్షణలో ఉతీర్ణులై ఉండాలి లేదా దానికి సమానమైన అర్హత కలిగి ఉండాలి.గిరిజన విద్య సంస్థలో పనిచేసిన అనుభవం కలిగిన వారికీ 20% వెయిటేజీ ఇవ్వబడును.ఒక సంవత్సరానికి గాను 5% చొప్పున,గరిష్టంగా 4 సంవత్సరాలకు వెయిటేజీ ఇవ్వబడును.
5. ఎంపిక అర్హత పరీక్షలో మెరిట్ మార్కులు మరియు TWD విద్యా సంస్థలలో పనిచేసిన అనుభవానికి వెయిటేజ్ ద్వారా
6. జీతం నెలకు రూ.22,750/- అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా
7. పోస్టుల సంఖ్య(15) గిరిజన బాలికల పాఠశాలలో కేవలం మహిళలు మాత్రమే దరఖాస్తు చేయవలెను.
ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తును అవసరమైన అన్ని పత్రాలతో అన్ లైన్ వెబ్ సైట్ ద్వారా తేది : 03.07.2023 నుండి దరఖాస్తుచేసుకొని తేది : 13.07.2023 (గురువారం) లోపు సమర్పించవలెనని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.మరిన్ని వివరాల కోసం ఫోన్ నంబర్ 8639388553 ను ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు (పని దినములలో) సంప్రదించగలరు.