ఏక్మాయిలో మిషన్ భగీరథ వాటర్ మ్యాన్ పై దాడి
బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : మిషన్ భగీరథ వాటర్ మ్యాన్ జావిద్ హైమత్ పై దాడి.ఎస్ఐ వేణు గోపాల్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం బషీరాబాద్ గ్రామంలో జావిద్ హైమత్ తండ్రి పేరు మంజూరు హైమద్, వయసు: 30 సంవత్సరాలు,కులo : ముస్లిం,వృత్తి : మిషన్ భగీరథ వాటర్ లైన్మెన్ పని చేస్తున్నాడు.శుక్రవారం రోజున మధ్యాహ్నం అందాజ 03:00 గంటల సమయంలో జావిద్ హైమత్ ఏక్మాయి గ్రామ సర్పంచ్ నారాయణ ఇంటికి ఆయన సంతకం కొరకు వెళ్ళాడు.ఆయన ఇంటి దగ్గర లేనందున పేపర్ వారి ఇంట్లో ఇవ్వమన్నాడు.
జావిద్ హైమత్ వారి ఇంట్లో సంతకం గురించి పేపర్ ఇచ్చి వద్దామని తన బైక్ తీస్తుండగా ఏక్మాయి గ్రామస్తులు అయినా బోయిని నాగప్ప తండ్రి పేరు గైబన్న, మరియు అద్దం శీను తండ్రి అద్దం సాయిలు జావిద్ హైమత్ దగ్గరికి వచ్చి ఎవడ్రా నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు అని అడగగా సర్పంచ్ సంతకం కోసం వచ్చినా అని చెప్పాడు.వారు వినకుండా జావిద్ హైమత్ ను అనవసరంగా గొడవపడి ఇష్టం వచ్చినట్లు బూతు మాటలు తిట్టడం జరిగింది.వీరితో గొడవ ఎందుకని జావిద్ హైమత్ అక్కడి నుండి బైక్ పై వస్తుండగా అతని వెంటనే వచ్చి మార్గమధ్యలో రోడ్డుపై రమేష్ గౌడ్ అనే వ్యక్తి పొలం దగ్గర జావిద్ హైమత్ అడ్డగించి,గొడవపడి జావిద్ హైమత్ ను ఇష్టం వచ్చినట్టు కట్టెలతో కొట్టగా జావిద్ హైమత్ కుడి చేయి, కుడి కాలుకి గాయల్లయ్యయి.కావున వారి పైన చట్టరిత్య చర్యలు తీసుకోవాలని జావిద్ హైమత్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వడం జరిగిందని తెలిపారు.