బండి సంజయ్ తన పదవికి రాజీనామా
* తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి బండి రాజీనామా
* తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న బండి సంజయ్ తన రాజీనా మా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు అందజేశారు. గత కొద్ది రోజులుగా తెలంగాణ బీజేపీలో జరుగుతున్న.పరిణామాల మధ్య బండి సంజయ్ ఢిల్లీకి వెళ్లారు. మంగళవారం జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ అనంతరం తను రాజీనామా చేసినట్లు బండి సంజయ్ ప్రకటించారు. తదుపరి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమించారు.