దొంగిలించిన నిందితుడు రిమాండ్ కు తరలింపు ఎస్ఐ
బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ పరిధిలోని తేదీ: 21-07-23 శుక్రవారం రోజున నమోదైన కేసు విషయంలో ఎస్ఐ వేణు గోపాల్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం గత శుక్రవారం రోజున నమోదైన కేసులో భాగంగా బషీరాబాద్ పోలీస్ వారు నిందితుడిని వెతుకుతుండగా తేదీ: 26-07-23 బుధవారం రోజున బషీరాబాద్ బస్టాండ్ లో ఒక వ్యక్తి అనుమానస్పదంగా సంచరిస్తుండగా పోలీస్ వారు అతన్ని పట్టుకొని విచరించగా అతను నా పేరు: సిరిళ్లి సిద్ధప్ప, తండ్రి:నాగప్ప,వయసు: 24 సంవత్సరాలు, కులం: ముదిరాజ్,వృత్తి:కూలి పని, నివాసం: క్యాద్గిరా గ్రామం, బషీరాబాద్ మండలం అని తెలుపగా పోలీస్ వారు దొంగతనం కేసు గురించి విచారించగా అతను తానే ఆ నేరం చేసినట్టు ఒప్పుకున్నాడు.తేదీ 16-07-23 ఆదివారం నాడు తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో బషీరాబాద్ లో పోస్ట్ ఆఫీస్ పక్కన ఉన్న మంగలి షాపు మూసి ఉండడం కనిపించింది.ఎలాగైనా డబ్బులు దొంగతనం చేయాలన్న ఉద్దేశంతో మంగళ షాపు తలుపు తాళం గ్రానైట్ రాయితో పగలగొట్టి షాప్ లోకి వెళ్లి షాప్ లోనే ఒక చిన్న డబ్బాలో ₹7,000 దొంగతనం చేసి అందులో వెయ్యి రూపాయలు ఖర్చు చేసినాడు.మిగతా 6000 పోలీస్ వారు పంచుల ఎదుట స్వాధీన పరుచుకొని అతన్ని రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు పర్చామని తెలిపారు.