కరెంటు షాక్ తో బాలుడు మృతి
కామారెడ్డి Kamareddy News భారత్ ప్రతినిధి : విద్యుత్ షాక్‌తో ఓ 19 నెలల బాలుడు మృతి చెందాడు.ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం అంతంపల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన రమ్య, భర్త బండి ప్రవీణ్‌తో గొడవపడి ఏడాది కాలంగా పుట్టింది వద్దే ఉంటుంది. సోమవారం రాత్రి తన కొడుకు శ్రీతిక్‌ను ఎత్తుకొని తీగపై బట్టలు ఆరావేస్తున్న క్రమంలో సడన్‌గా విద్యుత్ షాక్ తగిలింది. ఈ విషయాన్నిగమనించిన పక్కింటి వ్యక్తి, అక్కడికి చేరుకొని కట్టెతో వైరుపై గట్టిగా కొట్టాడు.
దీంతో తల్లీ రమ్య కింద పడిపోయింది. అప్పటికే బాలుడు శ్రీతిక్ నోటి మాట రాకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. వెంటనే అదే రాత్రి గ్రామ సర్పంచ్ చిట్టెడి మధు మోహన్ రెడ్డి తన వాహనంలో ఎక్కించుకొని కామారెడ్డిలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు పరీక్షించి బాలుడు అప్పటికే మృతిచెందాడని ధృవీకరించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. బాలుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ మేరకు స్థానిక పోలీసులకు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. వెంటనే గ్రామానికి చేరుకున్నపోలీసులు కేసు నమోదుచేసుకొని బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.