Type Here to Get Search Results !

Sports Ad

మహేష్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థపై కేసు నమోదు A case has been registered against the real estate firm of which Mahesh is the brand ambassador


 మహేష్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థపై కేసు నమోదు 

* 30 మంది బాధితులు సాయి సూర్య డెవలపర్స్‌పై ఫిర్యాదు 
* 406 420 కింద పోలీసులు కేసు నమోదు చేశారు
* సాయి సూర్య డెవలపర్‌ సంస్థ అధినేత సతీష్ చంద్ర గుప్తా 

హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిథి : సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థపై బుధవారం  కేసు నమోదు అయ్యింది. శ్రీ సాయి సూర్య డెవలపర్స్‌ అనే రియల్ ఎస్టేట్ సంస్థకు మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. అయితే ఆ సంస్థ ప్లాట్స్ పేరుతో డబ్బులు కట్టించుకుని ఎగ్గొట్టింది. దీంతో బాధితులంతా పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రకటనలు చూసి మోసపోయామని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. సాయి సూర్య డెవలపర్‌ సంస్థ అధినేత సతీష్ చంద్ర గుప్తాపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. 30 మంది బాధితులు సాయి సూర్య డెవలపర్స్‌పై ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదు మేరకు సాయి సూర్య డెవలపర్స్‌పై సెక్షన్‌ 406, 420 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 

మరిన్ని వార్తల కోసం..... 
* తాండూరు కాగ్నా నది బ్రిడ్జికి ఉరి వేసుకొని వ్యక్తి మృతి ఇక్కడ క్లిక్ చేయండి
* మహేష్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థపై కేసు నమోదు ఇక్కడ క్లిక్ చేయండి
* ఉలిక్కి పడ్డ ఇంటర్ బోర్డు ఇక్కడ క్లిక్ చేయండి 
* పోలీస్ స్టేషన్ లో నవ దంపతులపై దాడి ఇక్కడ క్లిక్ చేయండి
* ప్రేమ పెళ్లి కోసం మైనర్ విద్యార్థులు ఆత్మహత్య ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies