గజ్వేల్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ
సిద్దిపేట Siddipet News భారత్ ప్రతినిధి : సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో సోమవారం రాత్రి 9 గంటలకు చత్రపతి శివాజీ విగ్రహం వద్ద ముస్లిం వ్యక్తి మూత్ర విసర్జన చేశాడని హిందూ, ముస్లిం ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది పలువురికి గాయాలు అయ్యాయి. ఈ సంధర్బంగా పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత అక్కడికి చేరుకొని 24 గంటల్లో తప్పు చేసిన వారిని ఎంతటి వారినైనా ఎంత మందినైనా కేసు పెట్టి అరెస్టు చేస్తామని సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు.ఈ సంఘటన సంధర్బంగా హిందూ సంఘాలు నిరసనగా మంగళవారం బంద్‌కి పిలుపునిచారు.