కేటీఆర్ కు పలువురు విన్నుత రీతిలో శుభాకాంక్షలు
* మంత్రి కేటీఆర్ జన్మదినోత్సవం
* ఆపద్బాంధవుడు కేటీఆర్
* వెల్లువెత్తిన అభిమానం
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : సామాజిక మాధ్యమాల్లో మంత్రి కేటీఆర్ చురుగ్గా ఉంటారు. ఇతర రాజకీయనేతలందరి కంటే భిన్నంగా, పూర్తిగా పాజిటివ్ ధృక్పథంలోనే సోషల్ మీడియాను వినియోగిస్తూ తన ప్రత్యేకతను చాటు కుంటున్నారు. ప్రభుత్వం సాధించిన విజయాలు, తన పర్యటనల విశేషాలు పంచు కొంటారు. ప్రజా సమస్యలను తెలుసుకొనేందుకు, ప్రజలతో తన భావాలను పంచుకొనే వేదికగానే ట్విట్టర్‌ను వినియోగిస్తుంటారు. ‘ఆస్క్ కేటీఆర్’ హ్యాష్‌ట్యాగ్‌తో ప్రజల నుంచి సమస్యలను తానే స్వయంగా తెలుసుకుంటుండడం విశేషం. ఉర్దూ, ఇంగ్లిష్, హిందీ, తెలుగులో అనర్గళంగా మాట్లాడడమేగాక స్వయంగా ఆయనే ట్వీట్ చేస్తుంటారు. ఆయా భాషల్లో కవితలను కోట్ చేస్తూ దేశంలో జరిగే పరిణామాలపై సమయస్ఫూర్తిగా స్పందిస్తుంటారు. పాజిటివ్ దృక్కోణంలోనే విమర్శలను కూడా గుప్పించడం కేటీఆర్ ప్రత్యేకత. మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్‌లో 40.52 లక్షలు, ఫేస్‌బుక్‌లో 11.11 లక్షలు, ఇన్‌స్టాగ్రామ్‌లో 13.77 లక్షలు, లింక్‌డిన్‌లో 2.55 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారంటే ఆయన క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు.
వెల్లువెత్తిన అభిమానం ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు జన్మదినోత్సవం సందర్భంగా పలువురు వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపారు. ప్రజానేత, మంత్రి కేటీఆర్ దేశానికి నాయకత్వం వహించే దిశగా ఎదగాలని పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ ఆకాంక్షించారు. కేటీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా కోలేటి శుభాకాంక్షలు తెలిపారు. గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా పేదరికంతో చదువుకు ఇబ్బందులు పడుతున్న ఇద్దరు విద్యార్థినులకు టీఎస్ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్‌సాగర్ ఆర్థిక సాయం అందజేశారు. ఎంజీ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ చదువుతున్న కొమ్ము కిష్టయ్య కుమార్తె సుమతికి, మీర్‌పేట్ టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్న మల్లెపాక రాములు కుమార్తె శ్వేత కాలేజీ ఫీజుల కోసం కాలేజీ చదువు పూర్తయ్యే వరకూ రూ.లక్ష చొప్పున అంద జేస్తానని ప్రకటించారు.
నవతరం నాయకుడు, యువతరం ఆదర్శనీయుడు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అని టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో కేసీఆర్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ అమీర్ ఆధ్వర్యంలో రూపొందించిన ప్రత్యేక పాటల సీడీని ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్‌రెడ్డి, పౌర సరఫరాల సంస్థ మాజీ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ దేశానికి అభివృద్ధి నమూనా కావాలన్న కలను సాకారం చేస్తున్న కేటీఆర్ వందేండ్లు జీవించాలని అధికార భాషా సంఘం అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ ఆకాంక్షించారు. మంత్రి కేటీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా జూలూరు శుభాకాంక్షలు తెలిపారు.మంత్రి కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని ఎంపీ సంతోష్‌కుమార్ గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా ఆదివారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే)లో రెండు వేల మొక్కలు నాటారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం నాగారం గ్రామస్థులు పొలంలో వరితో హ్యాపీ బర్త్‌డే కేటీఆర్ అని ఏర్పాటుచేసి, అక్కడే కేక్ కట్ చేశారు. ఆపద్బాంధవుడు కేటీఆర్ అభాగ్యులకు అండగా నిలువడంలో మంత్రి కేటీఆర్ ముందు వరుసలో ఉంటారు. అటెండర్ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఎదిగిన సిరిసిల్ల జిల్లా చీకోడుకు చెందిన పిట్ల నర్సింహులు, ఇంటి కలను సాకారం చేసుకొన్న తంగళ్లపల్లి మండలం రామ చంద్రాపూర్‌కు చెందిన మేడిపల్లి నీలవ్వ, ఐదో అంతర్జాతీయ నేపాల్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన యువ కరాటే ప్లేయర్ జనగామ జిల్లా బచ్చన్నపేటకు చెందిన బొలుగుల చందు, కృత్రిమ కాలును అమర్చుకొన్న బీహార్ రాష్ట్రం సీవాన్‌కు చెందిన దివ్యాంగురాలు ప్రియాంశు కుమారి జీవితాలే కేటీఆర్ మానవీయతకు నిదర్శనాలు.