ప్రజల మనస్సుల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది
ఖమ్మం Khammam News భారత్ ప్రతినిధి : భారత్ జోడో యాత్రకు తెలంగాణ ప్రజలు అండగా నిలిచారని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఖమ్మంలో తెలంగాణలో జన గర్జన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ దేశాన్ని కలపడం మన విధానం విడదీయడం బీజేపీ విధానం కాంగ్రెస్ సిద్ధాంతాలకు ప్రజలు అండగా నిలిచారన్నారు. ప్రజల మనస్సుల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది అని రాహుల్ పేర్కొన్నారు.అనేక వర్గాల ప్రజలకు తెలంగాణ స్వప్నంగా ఉండేది. 9 ఏళ్ల పాలనలో ప్రజల ఆకాంక్షలను బీఆర్‌ఎస్ పట్టించుకోలేదు. బీఆర్‌ఎస్ అంటే బీజేపీకి బంధువు పార్టీ తెలంగాణ తాను రాజుగా కేసీఆర్ భావిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో లక్ష కోట్ల అవినీతి జరిగింది. ధరణితో ముఖ్యమంత్రి భూములు దోచుకుంటున్నారు. మిషన్ భగీరథలో వేల కోట్లు దోచుకున్నారు అని తెలిపారు.