గడప గడపకు కాంగ్రెస్
కొల్లాపూర్ kollapur News భారత్ ప్రతినిధి : కొల్లాపూర్ నియోజకవర్గంలో ని చిన్నంబావి మండలం పెద్దమారూరు గ్రామంలో కొల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతలపల్లి జగదీశ్వర్ రావు గారి ఆదేశాల మేరకు గ్రామంలో గడప,గడపకు తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చాక చేసే సంక్షేమ పథకాల గురించి సవివరంగా వివరించిన పెద్ద మారూరు గ్రామ కాంగ్రెస్ నాయకులు.
రైతుడిక్లరేషన్ కింద రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ ఆడ బిడ్డలకు రూ.500 లకే గ్యాస్ సిలెండర్ ఇందిరమ్మ ఇంటికి రూ.5 లక్షల సాయం ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉంటే కలిపి పెన్షన్ రూ.8వేలు. భూమి లేని కూలీలకు ప్రతి ఏడాదికి రూ.12వేలు
యూత్ డిక్లరేషన్ 18 సం||లు పైబడి, చదువుకునే ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్లు అందజేత. మొదటి ఏడాది రెండు లక్షల ఉద్యోగాల భర్తీ. తెలంగాణ ఉద్యమకారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డు అందజేత. నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించే వరకు ప్రతినెల 4000 రూ,నిరుద్యోగ భృతి చెల్లింపు. కాంగ్రెస్ హయాంలో నిరుద్యోగ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు సెంట్రలైజేడ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ను ఏర్పాటు.అని తెలుపుతున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద మారూరు గ్రామ మాజీ ఉప సర్పంచ్ నరేందర్ గౌడ్ గారు,గ్రామ కాంగ్రెస్ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.