దేశంలో ప్రస్తుతం ఎన్నికల సందడి నెలకొంది
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : దేశంలో ప్రస్తుతం ఎన్నికల సందడి నెలకొంది. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ జాతీయ మీడియా టైమ్స్ నౌ నవభారత్ 2024లో జరగబోయే లోక్ సభ ఎన్నికలపై నిర్వహించిన సర్వే వివరాలను వెల్లడించింది.
తెలంగాణలో ఓటరు నాడి భిన్నంగా ఉన్నట్టు సర్వే పేర్కొంది
రానున్న ఎన్నికల్లో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ 9 నుంచి 11 లోక్ సభ స్థానాలు గెలిచే అవకాశం ఉందని తెలిపింది. కాగా సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్ 2019 ఎన్నికల్లో కూడా 9 సీట్లు గెలిచిన సంగతి తెలిసిందే. ఇక బీజేపీ 3 నుంచి 5 స్థానాలు, కాంగ్రెస్ 2 నుంచి 3 స్థానాలు గెలిచే అవకాశం ఉందని తెలిపింది.ఏపీలో వైఎస్సార్‌సీపీ పార్టీ అత్యధిక లోక్‌సభ సీట్లు దక్కించుకుంటుందని సర్వే తెలిపింది. జాతీయ పార్టీల తర్వాత ఈ పార్టీ ఏకంగా 24 నుంచి 25 స్థానాలను గెలుచుకుంటుందని అంచనా వేసింది. మరో వైపు దేశవ్యాప్తంగా పరిశీలిస్తే మళ్లీ ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ అధికారంలోకి వస్తుందని సర్వే అంచనా వేసింది. బీజేపీకి సొంతంగా 285 నుంచి 325 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని ఈ సర్వే వెల్లడించింది.