Type Here to Get Search Results !

Sports Ad

డెంగ్యూ సోకితే ఏం చేయాలి ? జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి ? Dengue Alert

 


 డెంగ్యూ సోకితే ఏం చేయాలి ? జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి ?

Dengue ఆరోగ్యం : వర్షాకాలం వచ్చిందంటే వేసవి నుంచి ఉఫసమనం లభించడమే కాకుండా సీజనల్ వ్యాదుల భయం కూడా ఉంటుంది. దోమల బెడద ఎక్కువైతే సహజంగానే డెంగ్యూ ముప్పు అధికమౌతుంది.

డెంగ్యూ వ్యాధి సోకితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

వర్షాకాలం ప్రారంభం కాగానే డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వ్యాధుల భయం వెంటాడుతుంటుంది. ముఖ్యంగా డెంగ్యూ ప్రమాదం పొంచి ఉంటుంది. డెంగ్యూ అనేది అతి ప్రమాదకర స్తితి. డెంగ్యూ వచ్చిందంటే చాలు ప్లేట్‌లెట్ల సంఖ్య వేగంగా తగ్గి ప్రాణాంతకంగా మారుతుంది. డెంగ్యూలో ప్లేట్‌లెట్ కౌంట్ అనేది చాలా ముఖ్యమైనది. ప్లేట్‌లెట్స్ కౌంట్ ఎంత ఉండాలి, ఎలా ప్లేట్‌లెట్స్ కౌంట్ పెంచుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. 

డెంగ్యూ సోకితే గంట గంటకూ కౌంట్ పడిపోతుంటుంది. వెంటనే ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గినప్పుడు తక్షణం ప్లేట్‌లెట్స్ ఎక్కించకపోతే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. సాధారణంగా ఆరోగ్యవంతుడైన మనిషి శరీరంలో ప్లేట్‌లెట్ల సంఖ్య 3-4 లక్షల వరకూ ఉంటుంది. ఇది 60- 80 వేల వరకూ పడిపోయినా నష్టం లేదు. కానీ 20 వేలకంటే దిగువకు పడిపోతే మాత్రం ప్రమాదకరంగా భావిస్తారు. రోగి ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుంది. ఈ పరిస్థితుల్లో వెంటనే ప్లేట్‌లెట్స్ ఎక్కించాల్సి ఉంటుంది.

సాధారణంగా రక్తదాత ఇచ్చిన రక్తంలోంచి ఎర్రరక్తకణాలు, ప్లాస్మా, ప్లేట్‌లెట్లను వేరు చేసి ప్లేట్‌లెట్లను విడిగా ప్యాక్ చేసి అవసరమైనవారికి ఎక్కిస్తుంటారు. ఈ ప్రక్రియ బ్లడ్ బ్యాంకుల్లో జరుగుతుంటుంది. మీ బ్లడ్ అక్కడ ఇచ్చి మీక్కావల్సిన ప్లేట్‌లెట్లను సేకరించవచ్చు. 

అయితే ఇలా కాకుండా ఎప్పట్నించో అనాదిగా అమల్లో ఉన్న పద్ధతి ఉంది. అది బొప్పాయి ఆకుల రసం. దీనికోసం లేత బొప్పాయి ఆకులను పిండి రసం తీయాలి. ఈ రసాన్ని ఉదయం, రాత్రి డెంగ్యూ రోగులకు తాగిస్తే చాలా వేగంగా ప్లేట్‌లెట్లు పెరిగిపోతాయి.అయితే అప్లాస్టిక్ అనీమియా, లుకేమియా, లింఫోమా, డెంగ్యూ, వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు తెల్ల రక్తకణాలతో పాటు ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గిపోతుంది.

మరిన్ని వార్తల కోసం...  
* రైతులు 5 లక్షల బీమాకు దరఖాస్తు చేసుకోవాలి ఇక్కడ క్లిక్ చేయండి
* డెంగ్యూ సోకితే ఏం చేయాలి ? ఇక్కడ క్లిక్ చేయండి

* పోస్ట్ ఆఫిసుల్లో 12వేల పోస్టులు ఇక్కడ క్లిక్ చేయండి 
* ఈ నెల 14 తేదీన చంద్రయాన్‌-3 ప్రయెగం ఇక్కడ క్లిక్ చేయండి 
* పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో పెళ్ళికి సిద్ధం ? ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies