అన్నంలో పురుగులు రాళ్లు వస్తున్న పట్టించుకోని అధికారులు
* అధికారులు ఉన్నారా? నిద్రపోతున్నారా
* PDSU జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్
తాండూర్ Tandur భారత్ ప్రతినిధి: స్థానిక తాండూరు పట్టణంలోని జీనుగుర్తి గేటు వద్ద గల మోడల్ స్కూల్లో విద్యార్థులకు రోజు మధ్యాహ్న భోజనంలో రాళ్లు,పురుగులు వస్తున్నాయని విద్యార్థులు PDSU ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్ తో తెలియజేయడం జరిగింది.ఈ సందర్భంగా తాను మాట్లాడుతూ స్థానిక మోడల్ స్కూల్లో విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు ఉన్న కూడా ప్రిన్సిపాల్ ఏమాత్రం పట్టించుకోకుండా తిరిగి విద్యార్థులనే బెదిరిస్తున్నాడని విద్యార్థులు తెలపడం జరిగిందని ఇది సరైన పద్ధతి కాదని తెలియజేయడం జరిగింది. దానితోపాటు ప్రతిరోజు అన్నంలో పురుగులు,రాళ్లు వస్తున్న కూడా ఎన్నిసార్లు చెప్పిన కూడా పట్టించుకోవడంలేదని తెలియజేయడం జరిగింది. దానితోపాటు పుస్తకాలు కూడా ఇప్పటివరకు ఇవ్వలేదని, పైగా పాత పుస్తకాలు తీసుకొని తిరిగి వాటిని విద్యార్థులకు ఇస్తున్నారని ఇదెక్కడి పద్ధతిని ప్రశ్నించడం జరిగింది.
విద్యార్థుల దగ్గర టై కి డబ్బులు తీసుకొని చినిగినట్టైలు ఇచ్చారని తెలియజేయడం జరిగింది. దీనికంతటికి కారణమైన ప్రిన్సిపల్ ను వెంటనే సస్పెండ్ చేయాలని,ఇంత జరుగుతున్న అధికారులు అసలు ఉన్నారా ? అని ప్రశ్నించడం జరిగింది.కావున విద్యార్థిని ,విద్యార్థులకు మౌలిక వసతులు వెంటనే ఏర్పాటు చేయాలని,స్థానిక కలెక్టర్ గారు వెంటనే మోడల్ స్కూల్ ను సందర్శించాలని లేదంటే PDSU విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో త్వరలోనే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని,సమస్యను పరిష్కరించేంతవరకు స్కూల్ ముందు దీక్షలు చేపడతామని తెలియజేయడం జరిగింది.