బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా ఈటల
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : తెలంగాణ బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా ఈటల రాజేందర్ నియమించారు.ఈ సంధర్బంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా భాద్యతలు అప్పగించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, బీజేపీ జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారికి కేంద్ర మంత్రివర్యులు శ్రీ అమిత్ షా గారికి జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీఎల్ సంతోష్ గారికి రాష్ట్ర ఇంచార్జి శ్రీ తరుణ్ ఛుగ్ గారికి, శ్రీ సునీల్ బన్సల్ గారికి, కేంద్ర మంత్రివర్యులు,బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కిషన్ రెడ్డి గారికి మాజీ అధ్యక్షులు, ఎంపి శ్రీ బండి సంజయ్ కుమార్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.