నకిలీ సర్టిఫికెట్ నకిలీ డాక్టర్
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిథి : నకిలీ సర్టిఫికెట్లతో డాక్టర్‌గా చలామణి అవుతున్న ఓ వ్యక్తితో పాటు అతనికి సర్టిఫికెట్‌ను సమకూర్చిన మరో వ్యక్తిని సౌత్ ఈస్ట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఫలక్‌నుమా ప్రాంతానికి చెందిన ఖాజా ముజామిలుద్దీన్ (29) ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడు. అనంతరం మాసబ్ ట్యాంక్ లోని ఓ దంత వైద్యశాలలో పనిచేశాడు.దీనిని ఆసరాగా చేసుకుని తన స్నేహితుడు సయ్యద్ అబ్దుల్ అస్లాం ద్వారా కర్నాటక నుంచి నకిలీ బీడీఎస్ డాక్టర్ సర్టిఫికేట్ పొందాడు. ఇలా 2020 నుంచి ఫలక్‌నుమాలో ఆక్సీజన్ డెంటల్ క్లినిక్ నిర్వహిస్తున్నాడు. దీని పై విశ్వసనీయ సమాచారం అందుకున్న సౌత్ ఈస్ట్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎల్.రమేష్ నాయక్, శాలిబండ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి వైద్య సామాగ్రి, నకిలీ సర్టిఫికేట్లు స్వాధీనం చేసుకున్నారు.
* మరిన్నివార్తల కోసం...
* డాన్స్ అకాడమీ స్కూల్ ను ప్రారంభం ఎమ్మెల్సీ ఇక్కడ క్లిక్ చేయండి
* తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం ఇక్కడ క్లిక్ చేయండి
* పలువురిని పరామర్శించిన ఎమ్మెల్యే గారి తండ్రి ఇక్కడ క్లిక్ చేయండి
* నకిలీ సర్టిఫికెట్ నకిలీ డాక్టర్ ఇక్కడ క్లిక్ చేయండి