నకిలీ డాక్టర్ హాల్ చల్
* ఓ వైద్యుడు చదువుకు సంబంధం లేని వైద్యం
* అక్రమ సంపాదన ధ్యేయంగా
* ఉన్నత స్థాయి డాక్టర్ సహకారంతో
ఖమ్మం Khammam News భారత్ ప్రతినిథి : ఖమ్మం నగరంలో చిన్న పిల్లల ఆసుపత్రి పేరుతో ఓ వైద్యుడు చదువుకు సంబంధం లేని వైద్యం నిర్వహిస్తున్నారు. ఆ వైద్యుడు చేస్తున్న వైద్యంపై నిఘా పెట్టగా విస్తుపోయే నిజాలు బయటికి వచ్చాయి. అక్రమ సంపాదన ధ్యేయంగా అనతి కాలంలో కోటీశ్వరుడు అవ్వాలనుకున్న నేపథ్యంలో ఓ యువకుడు ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న ఉన్నత స్థాయి డాక్టర్ సహకారంతో ఈ తంతు జరుగుతున్నట్లు సమాచారం. ఫార్మ్ డి చదువుకున్న ఆ యువకుడు ఇప్పుడు చిన్న పిల్లల డాక్టర్ అవతారం ఎత్తి ఒక్కరోజు పసికందు నుండి పదేళ్ల లోపు పిల్లలకు వైద్యం నిర్వహించడం జరుగుతుంది. అసలు ఆ డాక్టర్ అవతారం ఎత్తిన యువకుడు ఆయన చదువుకున్న చదువుకు చేస్తున్న వైద్యానికి ఎలాంటి సంబంధం లేదని తేలింది. ఫార్మ్ డి లో పట్టా పొందిన ఆ యువకుడు కేవలం ఆసుపత్రి పరిధిలోని మందుల దుకాణానికి మాత్రమే సరిపోతాడు.
కానీ ఆయన చిన్న పిల్లల డాక్టర్ అంటూ నాలుగేళ్ల పాటు శిక్షణ పొందడంతో తాను పిల్లలకు వైద్యం నిర్వహిస్తున్నట్లు ఆయనే పేర్కొనడం కోస మెరుపు. ఈ విధంగా వైద్యం చేయడం తప్పు కదా అన్న ఓ దిన పత్రిక ప్రతినిధికి నేను పని చేసేది ఒక ఉన్నత స్థాయి ప్రభుత్వ వైద్యుడు వద్ద అని నన్ను మీరు ఏమి చేయలేరని ఎలాంటి వార్త రాసుకున్న నాకు ఏమి నష్టం జరగదని బీరాలు పోయాడు. ఇంత జరుగుతున్న వైద్యాధికారులు అటువైపు తొంగి చూడడం లేదంటే ఆసుపత్రి యజమాని ఒక ప్రభుత్వ వైద్యుడు కావడంతో వారు చూసి చూడనట్లు పోతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. గత రెండు నెలలుగా ఆసుపత్రి నిర్వహకుడు పిల్లల డాక్టర్ కావడం ఆయన ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్నత స్థాయిలో ఉండడంతో సమయం సరిపోక డ్యూటీ డాక్టర్‌గా ఇతన్ని నియమించినట్లు ఆస్పత్రిలో పనిచేసే ఓ సీనియర్ నర్స్ తెలిపారు.
రోజుకు 20 నుండి 30 ఓపీలు చూస్తూ పిల్లలకు ఇబ్బడి దిబ్బడిగా మందులు రాస్తున్నట్లు పేషంట్ తల్లిదండ్రులు వాపోతున్నారు. అతను చేస్తున్న వైద్యాన్ని నేరుగా పరిశీలించేందుకు ఓ వ్యక్తి పేషంట్ తండ్రి అక్కడికి వెళ్లడంతో నిజాలు బయటికి వచ్చాయి. ఎలాంటి జబ్బు లేని 9 ఏళ్ల బాలుడు జలుబు దగ్గు ఉంది అనడంతో ఆ వైద్యుడు బాలుడికి సుమారు రూ.600 లకు మందులు రాసి ఇవ్వడం జరిగింది. ఓపి షీటుపై ఆ డాక్టర్ ఫోటో కానీ పేరు కానీ ఉండదు. అయితే ఆస్పత్రి గోడపై క్రిటికల్ కేర్ వైద్యుడిగా చలామణి అవుతూ చిన్నపిల్లలకు వైద్యం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికైనా వైద్యాధికారులు ఇలాంటి దొంగ డాక్టర్లను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజల ప్రాణాలను కాపాడాలని ప్రజాసంఘాలు, మేధావులు కోరుతున్నారు.