పలువురి కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే తండ్రి
తాండూర్ Tandur News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా పెద్దముల్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త బోయిని జగన్నాథం గత మూడు రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడు.అట్టి విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కోహిర్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా గౌరవ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారికి ఫోన్ ద్వారా తెలియజేశారు.మృతుడు జగన్నాథంకి ఇద్దరు కుమార్తెలు వారిని గురుకుల పాఠశాలలో చదివిస్తామని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి హామీ ఇచ్చారు. అలాగే మంగళవారం రోజున బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోహిర్ శ్రీనివాస్ చేతుల మీదుగా 25 వేల రూపాయలు నగదును విట్టల్ రెడ్డి అందజేశారు.అదేవిదంగా పెద్దేముల్ మండలానికి చెందిన ఘాజీపూర్ గ్రామంలో గౌరవ విట్టల్ రెడ్డి గారు పర్యటించారు.గ్రామంలో వివిధ సమస్యలు మరియు ఘాజీపూర్ బ్రిడ్జిని ఎమ్మెల్యే గారి తండ్రి విట్టల్ రెడ్డి పరిశీలించారు.ఈ కార్యక్రమాలలో ఘాజీపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ టి.వీరప్ప మరియు సీనియర్ నాయకులు,పెద్దేముల్ బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కోహిర్ శ్రీనివాస్,మండల ప్రధాన కార్యదర్శి సి.రంగయ్య, సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు,శ్రీనివాస్ చారి యువ నాయకులు ప్రసాద్, శేశి కుమార్ తదితరులు పాల్గొన్నారు.