సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద అగ్ని ప్రమాదం
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : జులై 02 సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు దగ్గర్లోని అశోక లాడ్జిలో అగ్ని ప్రమాదం జరిగింది. లాడ్జిలోని వంటల గదిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపీరి పీల్చుకున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.