అతిరుద్రయాగంలో ఎగసిపడ్డ మంటలు
* మహాపూర్ణాహుతి సంపూర్ణం
* ప్రధాన యాగంలో ఎగసిన మంటలు
తాండూర్ Tandur News భారత్ ప్రతినిథి: తాండూరు పట్టణములో శాస్త్రంలో అతిరుద్ర, పౌండరిక సోమయాజి, అశ్వమేధ, రాజసూయ, దక్షయజ్ఞ, పుత్ర కామేష్టి,యాగాలు నిర్వహించేటప్పుడు, పూర్వహుతి అనంతరము యాగశాల దహనము చేసే శాస్తం ప్రాచీన కాలం నుండి రాజమహారాజులు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేవారు.ఎందుకంటే యాగం శాస్త్రం ప్రకారం అమ్మవారి పూజకు వాడిన సామాగ్రి కానీ,వస్తువులు కానీ దేనికి వాడకూడని తెలియజేసారు.
గత 11 రోజులుగా తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ రాజశ్యామల, శత చండీ, సౌర, లక్ష్మీ సుదర్శన సహిత అతిరుద్ర మహాయాగం చివరి రోజు గురువారం మహాపూర్ణాహుతితో సంపూర్ణమయ్యింది. గురువారం ఉదయం శ్రీ కామాక్షీ పీఠం(శ్రీకాకుళం)కు చెందిన వేద పండితులు ప్రధాన యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. పూర్ణాహుతి సందర్భంగా నిర్వహించిన పూజలతో ప్రధాన యాగశాలలో మంటలు ఎగిసి పడ్డాయి. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నిర్వహించిన శ్రీ అతిరుద్ర మహాయాగం విజయవంతం అయ్యిందని చెప్పడానికి ప్రధానా యాగశాలలో ఎగిసిన మంటలు నిదర్శనంగా వేద పండితులు పేర్కొంటున్నారు. గత 11 రోజులుగా నిర్వహించిన శ్రీ అతిరుద్ర మహాయాగం విజయవంతానికి సహకరించిన రుత్వికులు, వేద పండితులు, పురోహితులు, భక్తులు, పార్టీ నేతలు, స్వచ్చంద సేవా సంస్థలకు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మహాపూర్ణాహుతి సందర్భంగా ప్రధాన యాగశాలలో ఎగిసిన మంటలను ఆ తరువాత అగ్నిమాపక సిబ్బందితో ఆర్పించారు.
* మరిన్ని వార్తల కోసం......
* ఇస్రో చంద్రయాన్ -3కు సర్వం సిద్దం ఇక్కడ క్లిక్ చేయండి
* మద్యం మత్తులో రైతును ఢీ కొట్టిన వ్యాన్ ఇక్కడ క్లిక్ చేయండి
* మా ఊర్లో కాంగ్రెస్‌కు ప్రవేశం లేదు ఇక్కడ క్లిక్ చేయండి
* అతిరుద్రయాగంలో ఎగసిపడ్డ మంటలు ఇక్కడ క్లిక్ చేయండి
* మూఢ నమ్మకాలను నమ్మవద్దు ఇక్కడ క్లిక్ చేయండి
* ప్రభుత్వ దావఖానలో ఓ రోగి హత్య ఇక్కడ క్లిక్ చేయండి