గుడ్‌న్యూస్ వారం రోజుల్లో టెట్ నోటిఫికేషన్
* పోటీపడనున్న 2 లక్షల మందికిపైగా అభ్యర్థులు
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను సెప్టెంబర్ మూడోవారంలో నిర్వహించాలని రాష్ట్ర విద్యాశిక్షణా పరిశోధన సంస్థ (ఎస్సీఈఆర్టీ) నిర్ణయించింది. వారం రోజుల్లోపే నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయం తీసుకొన్నది. ఇటీవల సమావేశంలో టెట్ నిర్వహణకు మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్సీఈఆర్టీ అధికారులు టెట్ నిర్వహణపై ప్రతిపాదనలు రూపొందించి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణకు అందజేశారు. ఆయా ప్రతిపాదనలను
విద్యాశాఖ ఆమోదించగా, టెట్ నిర్వహణపై అధికారులు కసరత్తును వేగవంతం చేశారు. సెప్టెంబర్ 15 ముందు లేదా తర్వాత ఎప్పుడైనా నిర్వహించాలని భావిస్తున్నారు. అంతర్గతంగా టెట్ నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు. పోటీపడనున్న 2 లక్షల మందికిపైగా అభ్యర్థులు తాజా అంచనాల ప్రకారం రాష్టంలో 1.5 లక్షల డీఎడ్, 4.5 లక్షల మంది బీఎడ్ అభ్యర్థులున్నారు. 2017 టీఆర్టీ నోటిఫికేషన్ ద్వారా 8,792 టీచర్ పోస్టులను
భర్తీచేశారు. గతంలో టెట్‌కు 7 సంవత్సరాల వ్యాలిడిటీ ఉండగా, రెండేండ్ల క్రితం టెట్ వ్యవధిని జీవితకాలం పొడిగించారు. పైగా గతంలో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు పోటీపడే అవకాశం డీఎడ్ వారికే ఇవ్వగా, ఇటీవలే బీఈడీ వారికి కూడా అవకాశం కల్పించారు. దీంతో గతంలో టెట్ క్వాలిఫై అయిన వారితో పాటు బీఈడీ అభ్యర్థులకు ఉపశమనం కలిగింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2 లక్షల మంది టెట్ క్వాలిఫై కానివారున్నారు. వీరే కాకుండా కొత్తగా బీఈడీ, డీఎడ్ పూర్తిచేసిన వారు మరో 20వేల వరకుంటారు. తాజా టెట్ నిర్వహణతో వీరందరికి మరోమారు పోటీపడే అవకాశం దక్కుతుంది.
మరిన్ని వార్తల కోసం
* ఏక్మాయిలో మిషన్ భగీరథ వాటర్ మ్యాన్ పై దాడి ఇక్కడ క్లిక్ చేయండి
* వాగులో కారు గల్లంతు ఇక్కడ క్లిక్ చేయండి
* జరిగిన ఘటనపై మోడీ మాట్లాడక పోవటానికి గల కారణమేంటి ? ఇక్కడ క్లిక్ చేయండి
* గుడ్‌న్యూస్ వారం రోజుల్లో టెట్ నోటిఫికేషన్ ఇక్కడ క్లిక్ చేయండి