గంజాయి ముఠాను అరెస్ట్ చేసే దమ్ము పోలీసులకు లేదు
* గంజాయి మత్తులో రోడ్లపై యువకుల నానా హంగామా
* అర్ధరాత్రి ప్రజలను భయాందోలనకు గురిచేస్తున్నా గంజాయి బ్యాచ్
హైదరాబాద్ News భారత్ ప్రతినిథి: పాత బస్తీలో అర్ధరాత్రి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రెయిన్ బజారులోని పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు గంజాయి బ్యాచ్ అడ్డాలపై దాడులు నిర్వహించారు. మొత్తం 15 మంది యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు.పాతబస్తీలో గంజాయి బ్యాచ్ ఆగడాలు రోజు రోజుకు పెరిగి పోతున్నాయి. గంజాయి మత్తులో రోడ్డుపై నానా హంగామా సృష్టిస్తున్నారు. అర్థరాత్రి స్థానికులను భయాందోళనలకు గురి చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారు. ఇటీవల పాత బస్తీలో అక్బర్ అండ్ గ్యాంగ్ రెచ్చిపోయింది.
ఇంటి ముందు స్నేహితుడితో మాట్లాడుతున్న పర్వేజ్ అనే యువకుడితో అకారణంగా గొడవకు దిగింది. వెంట తెచ్చుకున్న కత్తితో పర్వేజ్‌పై దాడి చేసి పరైంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పర్వేజ్ సోమవారం రాత్రి మృతి చెందాడు.పాతబస్తీలో రౌడీ షీటర్లు..రూ.2లక్షలు తీసుకుని హత్యలకు పాల్పడుతున్నారని, పోలీసులతో నేరస్తులు మిలాఖాత్ అవుతున్నారని ఎమ్మెల్యే పాషాఖాద్రి ఆరోపించారు. హత్య చేసిన తర్వాత లొంగిపోయి, 15-20 రోజుల్లో బెయిల్ తెచ్చుకుంటున్నారని చెప్పారు. అంతేకాదు.. గంజాయి బ్యాచ్‌లపై ఫిర్యాదులు చేస్తే పోలీసులు వచ్చి అమాయకులను వేధిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం గంజాయిగాళ్లపై పీడీయాక్ట్ పెట్టాలని ఎమ్మెల్యే పాషాఖాద్రి డిమాండ్ చేశారు.
దీంతో పర్వేజ్ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పాషాఖాద్రి పరామర్శించారు. రూ.2 లక్షలు తీసుకుని హత్యలకు పాల్పడే నేరస్తులు పోలీసులతో కుమ్మక్కయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం ఎమ్మెల్యే చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. గంజాయి ముఠాను అరెస్ట్ చేసే దమ్ము, ధైర్యం పోలీసులకు లేదని కామెంట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. పోలీసులే గంజాయి గ్యాంగ్‌లను ప్రోత్సహిస్తున్నారని, డబ్బులు తీసుకుని గంజాయి బ్యాచ్‌ను వదిలేస్తున్నారని ఎమ్మెల్యే పాషాఖాద్రి ఆరోపించారు.