జరిగిన ఘటనపై మోడీ మాట్లాడక పోవటానికి గల కారణమేంటి?
బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో మణిపూర్ ఘటన పై కెవిపిఎస్ కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు.కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎడ్ల సురేష్ మాట్లాడుతూ భారతదేశంలో ఈనాడు ఆర్థిక సంస్కృతిక సంక్షోభంలో కొట్ట మీటలాడుతుంది స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు అయిన కూడా ఇంకా గిరిజనులపై వివక్ష దళితులపై మరణకాండ స్త్రీలపై మరణ హోమం జరుగుతూనే ఉన్నాయి.భారతదేశంలో ప్రధానమైన సమానత్వపు హక్కు అది నిరంతరం ఉల్లంగించ బడుతుంది.మణిపూర్ లో ముఖ్యంగా ఇద్దరూ గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించి వారిపై అత్యాచారం చేసిన ఘటన భారతదేశ మానవ హక్కుల వేదిక ముందు తలదించుకునేలా చేసింది.
సుప్రీంకోర్టు కలగా చేసుకున్నాకే మోడీ మాట్లాడడం ప్రధాని సకాలంలో స్పందించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు మహిళలను నగ్నంగా ఊరేగించింది.మే 4వ తేదీన మహిళల మీద అత్యాచారం జరిగిందన్న మహిళ కమిషన్ ఇద్దరు మహిళల మీద ఏమైనా అత్యాచారం వీడియో బయటకు వస్తే గాని స్పందించకపోవడం దారుణం ఇకపోతే జాతీయ మహిళా కమిషనర్ విషయానికి వస్తే జూన్ 12న నార్త్ అమెరికా మణిపూర్ టైబర్ అసోసియేషన్ మణిపూర్ మహిళా కార్యకర్తలు రాసిన లేక ఒకటి కమిషనర్ కు చేరింది కంగ్బో కి జిల్లాలో బి ఫైనమ్ గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలను వివస్త్రాలను చేశారు.
నగ్నంగా ఊరేగించారు కొట్టడం మాత్రమే కాకుండా చుట్టూ ముట్టిన మైతేయి ముఖ బహిరంగంగా మానభంగానికి పాల్పడింది రాష్ట్రానికి చెందిన పోలీసులు ప్రేక్షకులుగా ఉండిపోయారు.నిజానికి పోలీసుల నిర్లక్ష్యం అతిగా ఉంది.భారతదేశంలో ఈ రోజున గిరిజన శ్రీ రాష్ట్రపతిగా ఉంది ఓ పక్క గౌరవం ఇస్తూనే మరోపక్క దళితులను గిరిజనులను మానభంగం చేయటం చూస్తుంటే దళితులపైన స్త్రీల పైన బహుజనపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుట్ర దాగి ఉన్నాయి.ఈ ఘటనలో నిందితులకు కఠినమైన శిక్ష వేసి ఉరితీయాలని కెవిపిఎస్ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది.ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు ఎడ్ల సురేష్ కార్యకర్తలు నరేష్ రాజు మోహన్ సాంబ లక్ష్మణ్ రామచందర్ తదితరులు పాల్గొన్నారు.