భార్య కనిపించడం లేదని భర్త ఫిర్యాదు
బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : భార్య కనిపించడం లేదని భర్త పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది.ఎస్ఐ వేణు గోపాల్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం బషీరాబాద్ మండలం ఖాసింపూర్ గ్రామనికి చెందిన గొట్టిగ శ్రీనివాస్ తండ్రి పేరు దేవప్ప,వయస్సు : 30 సంవత్సరాలు, కులం : ఎస్సీ, కూలి పని చేస్తూ బ్రతికేవారు.శ్రీనివాస్ కి గత మూడు సంవత్సరాల క్రితం లావణ్య తండ్రి పేరు చంద్రప్ప,వయసు : 24 సంవత్సరాలు, కులం: ఎస్సీ, తో వివాహం జరిగింది. అయితే తేదీ : 15-07-2023 శనివారం రోజున రాత్రి అందాజా 10:00 గంటల సమయంలో తధావిధిగా భార్య భర్తలు అన్నం తిని పడుకున్నారు. తిరిగి తేదీ 16-07-2023 ఆదివారం రోజున తెల్లవారుజామున ఉదయం అందాజా ఐదు గంటల సమయంలో భర్త నిద్రలేచి చూసి సరికి అతని భార్య లావణ్య ఇంట్లో కనిపించలేదు.తర్వాత చుట్టుపక్కల మరియు బంధువుల వద్ద వెతికిన తన భార్య ఆచూకీ లభించలేదు. కావున తన భార్య ఆచూకీ కనిపెట్టడం కోసము భర్త శ్రీనివాస్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వడం జరిగిందని తెలిపారు.