ప్రేమ పెళ్లికి ఇంట్లో ఒప్పుకోలేదని ఇంటర్ స్టూడెంట్స్ ఆత్మహత్య
* కులాలు వేరుకావడంతో మైనర్ విద్యార్థులు
* ఇంట్లో ఒప్పుకోలేదని ఇంటర్ స్టూడెంట్స్
* ఓ ఇంట్లో ఇద్దరూ ఒకే తాడుకు ఉరేసుకుని ఆత్మహత్య
సిద్దిపేట Siddipet News భారత్ ప్రతినిధి : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. దుబ్బాక మండలం లచ్చపేటలో ఓ ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడింది. కులాలు వేరుకావడంతో తమ ప్రేమకు పెద్దలు ఒప్పుకోరని మనస్తాపం చెందిన వాళ్లు ఇంట్లో బుధవారం తెల్లవారుజామున ఉరివేసుకున్నట్లు సమాచారం.
వివరాల ప్రకారం దుబ్బాకలోని ఓ ప్రైవేటు కళాశాలలో నేహా ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. అదే కాలేజీలో లచ్చపేటకు చెందిన భగీరథ్ సెకండియర్ చదువుతున్నాడు. వీళ్లిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో బుధవారం భగీరథ్ కు చెందిన ఓ ఇంట్లో ఇద్దరూ ఒకే తాడుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.