రానున్న నాలుగు రోజుల్లో భారీ వర్షాల హెచ్చరిక
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : దేశవ్యాప్తంగా రానున్న కొద్ది రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రకారం వచ్చే నాలుగు రోజుల్లో పశ్చిమ బెంగాల్ సిక్కిం, బీహార్, అస్సాం, మేఘాలయ అరుణాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్‌లలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయి.అలాగే IMD ప్రకారం కేరళ కర్ణాటక, తమిళనాడు ,ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గోవా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్,గుజరాత్‌లలో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాల బారిన పడకుండా ఉండేందుకు తగు చర్యలు తీసుకోవాలని వాతావరణ అధికారులు రాష్ట్రాలను అప్రమత్తం చేశారు.