ఎమ్మెల్యే గారిపై లేనిపోని అభాండాలు వేయడం మంచిది కాదు
తాండూర్ Tandur News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణములో కల్లుండి చూడలేని కబోదులు.కోటపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పరి మహేందర్ మాట్లాడుతూ తాండూర్ శాసనసభ్యులు పైలెట్ రోహిత్ రెడ్డి గారిపై లేనిపోని అభాండాలు వేయడం మంచిది కాదు.ఒక్కసారి తాండూర్ నియోజకవర్గాన్ని పర్యటించి నిజాలు తెలుసుకొని సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము.
గత 40 సంవత్సరాలుగా కానీ అభివృద్ధి ఇప్పుడు తాండూర్ నియోజకవర్గంలో జరుగుతుంది అని ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తుంటే ఇలాంటి సమాచారం తాండూర్ ప్రజల మనోభావాలు దెబ్బతీయ రాదు అని కోరుచున్నాము.ప్రతి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సామాన్య ప్రజలు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్లి సమస్యను వివరించిన వెంబడే అక్కడికక్కడే పరిష్కారం చూపుతున్న ఎమ్మెల్యే గారిపై నిందలు వేయడం సమంజసం కాదు. ప్రజల సంతోషం కోరుతూ తాండూరులో 11 రోజులు 11 వేల జంటలతో యాగం నిర్వహించింది కనిపించడం లేదా? తాండూర్ నియోజకవర్గం అభివృద్ధిలో ముందు వరుసలో ఉండాలని కొన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేయుచున్నది కనిపిస్తలేదా? తాండూర్ ప్రాంతానికి సేవ ఎవరు చేస్తున్నారు అని ప్రజలందరూ గ్రహిస్తున్నారు అని తెలిపారు.