కిలాడీ లేడీ వలలో పెళ్లి కొడుకులు.
Crime News భారత్ ప్రతినిధి : పెళ్లి పేరుతో పలువురు యువకులను పెళ్లి చేసుకొని, కొద్ది నెలలు కాపురం చేసినట్లు నటించి, లక్షలాది రూపాయల నగదు, బంగారంలో యువతి పరారవుతున్న సంఘటన ఎన్టీపీసీ రామగుండంలో వెలుగు చూసింది.ఉమ్మడి వరంగల్ జిల్లా నెక్కొండ మండలానికి చెందిన పెంట అనూష మ్యాట్రిమోన్లో యువకులకు పెళ్లి పేరుతో మోసాలకు పాల్పడుతుందని బాధితుడు సుద్దాల వేణు ఎన్టీపీసీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు పెంట అనూష గత సంవత్సరం మాట్రిమోన్లో పరిచయం అయిందని, పెళ్లి చేసుకోవడానికి అంగీకరించడంతో అప్పుడే తనకు డబ్బులు అవసరం ఉందని తెలపడంతో రెండు లక్షల రూపాయలు ఆన్‌లైన్ ద్వారా పంపించాలని తెలిపిందని వేణు ఫిర్యాదులో తెలిపాడు.