నూతన అధ్యక్షులు MD జహుర్ కి సన్మానించిన ఎమ్మెల్యే
తాండూర్ Tandur News భారత్ ప్రతినిధి : వికరాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో లారీ డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ అసోసియేషన్ ఆద్వర్యరంలో ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల ఎంపిక ప్రకారం తాండూర్ పట్టణానికి చెందిన లారీ డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షులు MD జహుర్ ఎనుకున్నారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నూతనగా ఎన్నికైన అధ్యక్షులు MD జహుర్ గారిని శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి డ్రైవర్ కి 10 లక్షల యాక్సిడెంట్ బీమా, వర్తింపజేసేలా చేస్తానని మరియు అదే విధంగా తాండూర్ లో స్పెషల్ క్యాంపు ఏర్పాటు చేసి లారీ అసోసియేషన్ సభ్యులకు డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించే కార్యక్రమం కచ్చితంగా చేపడుతానని తెలియజేశారు. అదేవిధంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షునికి బీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షులు గోపాల్ గారికి అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్ ,మున్సిపల్ వైస్ చైర్మన్ దీప-నర్సింలు కౌన్సిలర్ మంకల్ రాఘవేందర్ లారీ డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.