గనులను తనీఖీ చేస్తున్న మైన్స్ అధికారులు
బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలోని శనివారం బషీరాబాద్ శివారులో ఉన్న కొన్ని గనులను మైన్స్ టెక్నికల్ అసిస్టెంట్ నాగలక్ష్మీ తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పలు గ్రామాలలో జీవన్గి,కొర్విచేడ్, క్యాద్గిర్,ఎక్మాయి సరిహద్దులు ఉన్నటు వంటి ప్రభుత్వ భూముల్లో అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వకాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకుంటామని మైన్స్ టెక్నికల్ అసిస్టెంట్ నాగలక్ష్మీ తెలిపారు.తనిఖీల్లో భాగంగా నాపరాతిని కటింగ్ చేసే మెషిన్ పనిముట్లు మూడు బ్లేడ్లు, చిన్న వాటర్ మోటర్లు,10 లీటర్ల వరకు డీజీలు, స్వాధీనం చేసుకొని రెవెన్యూ అధికారులకు అప్పగించినట్లు ఆమె పేర్కొన్నారు. కొంతమంది స్థానిక నాయకులు కార్మికుల నుంచి డబ్బులు వసూలు చేసి కార్మికులకు ఇబ్బందుల గురి చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇలాంటివి తమ దృష్టికి వస్తే డబ్బులు వసూలు చేసిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ భూములు ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వకాలు జరపరాదని, ఒకవేళ జరిపినచో వారిపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మైన్స్ అధికారులు, రెవెన్యూ శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.