ఇసుక దోపిడీలో ఎమ్మెల్యే అనుచరులు
తాండూర్ తెదేపా సీనియర్ నాయకులు
ఎం శ్రీనివాస్ ఎడ్ల, సురేష్ గాటు వాక్యలు
తాండూర్ Tandur News భారత్ ప్రతినిథి : వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలో అడ్డదిడ్డంగా ఇసుక దోపిడి బషీరాబాద్ మండలంలో తొంబై శతం ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కార్యకర్తలు అంతులేకుండా ఇసుక అమ్ముకుంటున్నారని తాండూర్ నియోజకవర్గ తెదేపా సీనియర్ నాయకులు చేవెళ్ల పార్లమెంట్ కార్యదర్శి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో మండిపడ్డరు.శ్రీనివాస్ మాట్లాడుతూ రెండు ట్రాక్టర్లు పర్మిషన్ తీసుకొని 10 ట్రాక్టర్లు కొట్టుకుంటున్నారు 10 ట్రాక్టర్లు పర్మిషన్ తీసుకొని 30 నుండి 50 ట్రాక్టర్లు కొట్టుకొని ఇష్టం వచ్చినట్లు డంపింగ్ చేసి అమ్ముకుంటున్నారని శ్రీనివాస్ అన్నారు. పది రోజుల కింద పిఎస్ కు తహశీల్దార్ గారికి ఫోన్ చేసినా సరైన రెస్పాన్స్ రాలేదు.స్వయంగా తహశీల్దార్ ఆఫీస్ కు వెళ్లి వెంకటస్వామిని వాగుకు తీసుకొని వెళ్ళరు.అక్కడ ఎన్నో పర్మిషన్ లేని టాక్టర్లు కొన్నిటికి పర్మిషన్ ఉన్న రెండు మూడు పర్మిషన్ అంటే ఎన్నో ట్రాక్టర్లు తరలిస్తున్న ట్రాక్టర్లను స్వయంగా తహశీల్దార్ కు చూపించారు.ఈ దోపిడీ అరికట్టక పోతే జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరుగుతుందని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.ఈ యొక్క కార్యక్రమంలో ఎడ్ల సురేష్ మరియు కార్యకర్తలు యువకులు ఉన్నారు.