మహాయాగంలో పాల్గొని ప్రవచనాలను తెలియజేసిన గరికపాటి నర్సింహారావు
తాండూర్ Tandur News భారత్ ప్రతినిధి : తాండూర్ పట్టంలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దేశంలో ఎక్కడ జరగని విధంగా నిర్వహిస్తున్న శ్రీ రాజ్యశ్యామల, శతచండీ, సౌర,లక్ష్మీ సుదర్శన సహిత అతిరుద్ర మహాయాగంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి,పుణ్య దంపతులకు మరియు భక్తులకు ప్రవచనాలను భోధించిన పద్మశ్రీ అవార్డు గ్రహిత గరికపాటి నర్సింహారావు ఈ సందర్భంగా భోదిస్తూ రాజశ్యామల యాగం అనేది మాములుగా చేసే యాగం కాదని రాజయోగానికి సూచిక అని,బ్రహ్మాండంగా ఏనుగుని కూడా తీసుకురావడం అది ఐశ్వర్యానికి సూచిక అని, అదే విధంగా పురుషుడు పూర్ణస్వరూపుడు అని, స్త్రీ అమ్మవారి స్వరూపం అని, కాబట్టి అమ్మవారైన ఈ రాజశ్యామల యాగం అనేది అతి గొప్పదైనదని, మరియు 11వేల మంది పుణ్య దంపతులతో నిర్వహించడం అనేది ఆ అమ్మవారి యొక్క గొప్ప సంకల్పం మరియు ఆశీర్వాదంతో మాత్రమే సాధ్యం అవుతుందని తెలిపారు.
అంతే కాకుండా ఇన్ని యాగాలు ఒకేసారి కలిపి చేయడం ద్వారా ఈ ప్రాంత ప్రజలకు రాష్ట్రానికి మరియు దేశాప్రజానీకానికి మొత్తం సుఖసంతోషాలు, మరియు ఆయురారోగ్యాలతో ఉండాలని చేసిన ఈ యొక్క మహాయగాన్ని ఆ అమ్మవారు మరియు సకల దేవతలు కచ్చితంగా నెరవేరుస్తారని చెప్పారు.
అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మాట్లాడుతూ నేను ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి అయినప్పటికీ తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు మొదటిగా సమర్థించిన వ్యక్తిని నేనే. ఆ విషయం కేసిఆర్ గారు కూడా చెప్పడం జరిగింది.దేశానికి ధాన్యాగారం తెలంగాణ రాష్ట్రం ఉండడం మనందరి అదృష్టం. మన రాష్ట్రాలు వేరైనప్పటికీ భాషా పరంగా మనమంతా ఒకటే అని గుర్తు పెట్టుకొని, ఏది ఏమైనా కూడా అందరూ కలిసి ఉండాలని తెలియజేశారు.
చివరగా అన్ని వర్ణాల వారు, అన్ని జాతుల వారు స్త్రీ పురుష అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ స్వయం సమృద్ధి సాధించాలని కోరుకుంటున్నాను.ఈ సందర్భంగా తాండూర్ ఎమ్మెల్యే, పైలట్ రోహిత్ రెడ్డి గారు గరికపాటి నరసింహారావు గారికి ఈ యొక్క అతిరుద్ర మహా యాగానికి వచ్చినందుకు శిరస్సువంచి ధన్యవాదాలు తెలియజేశారు.అనంతరం వారిని సన్మానించి వారికి అమ్మవారి జ్ఞాపికను అందించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క యాగంలో తాండూరు మరియు తాండూరు నియోజకవర్గంకి సంబంధించిన పుణ్య దంపతులు అందరూ కూడా వచ్చి ఈ యొక్క యాగంలో పాల్గొని యాగఫలం పొందుకోవాలని కోరారు. అందరూ అనుకున్నట్లుగా కేవలం 11వేల దంపతులు మాత్రమే కాకుండా అంతకంటే ఎక్కువగా అనగా 20,000 లేదా 30,000 మంది పుణ్య దంపతులు వచ్చినప్పటికీ కూడా అన్ని ఏర్పాట్లు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేశారు.