ప్రతి గ్రామానికి వెళ్లి చైతన్యం చేస్తున్న ఎమ్మార్పీఎస్ నాయకులు
తాండూర్ Tandur News భారత్ ప్రతినిధి : ఆగస్టు 3న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ తాండూర్ కు రాక ఎమ్మార్పీఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి. వికారాబాద్ జిల్లా కో కన్వీనర్ ప్రకాష్ మాదిగ మహా జన సోషలిస్ట్ పార్టీ బషీరాబాద్ మండల్ ఇంచార్జ్ బి కృష్ణ మాదిగ ప్రతి గ్రామానికి వెళ్లి చైతన్యం చేస్తున్న ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి ఎంఎస్ఎఫ్ నాయకులు. రెండో వారంలో హైదరాబాద్ లో జరగబోయే మాహసభ ను విజయవంతం చేయుటకై వికారాబాద్ జిల్లా లోని వికారాబాద్ తాండూర్ నియోజకవర్గంలో ఆగస్టు 3న జరగబోయే సన్నాక సాదస్సుకు ముఖ్య అతిథులుగా మందకృష్ణ మాదిగ. ఉదయం 10 గంటలకు తాండూర్ మధ్యాహ్నం రెండు గంటలకు వికారాబాద్ సాదస్సుకు హాజరవుతారని వికారాబాద్ జిల్లా కో కన్వీనర్ ప్రకాష్ మాదిగ తెలిపారు. బిజెపి పై ఒత్తిడి తెచ్చే విధంగా ఆగస్టు రెండో వారంలో జరగబోయే మాదిగల విశ్వరూప మహాసభను జాంతం చేయకై ఎమ్మార్పీఎస్ శ్రేణులు వివిధ పార్టీలలో వివిధ ప్రజా సంఘాల్లో ఉన్నటువంటి మాదిగలంతా ఏకమై మన బలాన్ని చాటి చెప్పి ఎస్సి రిజర్వేషన్లు వర్గీకరణ సాధించుకొని జాతికి సామాజిక న్యాయాన్ని అందించే పోరాటంలో భాగస్వాములు కావాలని కోరారు. ముఖ్య నాయకులు ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు కిష్టప్ప మాదిగ బీమప్ప మాదిగ శ్రీశైలం రామకృష్ణప్ప నరేష్ గ్రామస్తులు పాల్గొన్నారు.