ఆర్జీయూకేటీ ఇంటిగ్రేటెడ్ ప్రవేశాలు విడుదల
నిర్మల్ News భారత్ ప్రతినిధి : నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులో 2023-24 విద్యాసంవత్సరానికి విద్యార్థుల ప్రవేశాల జాబితాను సోమవారం ప్రకటించింది. మొత్తం 1,605 సీట్లకు 13,538 దరఖాస్తులు రాగా సీట్లు పొందిన 1,404 మంది విద్యార్థుల జాబితాను ఇన్‌ఛార్జి ఉపకులపతి వెంకటరమణ, డైరెక్టర్ సతీష్‌కుమార్ విడుదల చేశారు. ఈ జాబితాను విశ్వవిద్యాలయ వెబ్‌సైట్ www.rgukt.basara.in లో నిక్షిప్తం చేశారు. ఇందులో 938 మంది బాలికలు, 466 మంది బాలురు ఉన్నారు. 14 మంది ఏపీ విద్యార్థులున్నారు. సిద్దిపేట జిల్లా నుంచి అత్యధికంగా 322 మంది సీట్లు సాధించారు. ఎంపికైన విద్యార్థులకు ఈ నెల 7, 8, 9 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ఉపకులపతి తెలిపారు. దివ్యాంగులు, క్రీడా విభాగాల విద్యార్థులకు 14న, ఎన్‌సీసీ, క్యాప్ విద్యార్థులకు 15న ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందన్నారు. అనంతరం 96 సీట్లను ఎన్‌సీసీ, క్రీడా, సైనిక విద్యార్థులు, దివ్యాంగులతో భర్తీ చేస్తామన్నారు. గ్లోబల్ కేటగిరి కింద 105 సీట్లు భర్తీ అవుతాయని పేర్కొన్నారు.