ఎక్మాయి గ్రామంలో పంచాయతీ కార్మికులకు అన్యాయం చేస్తున్నా కార్యదర్శి,సర్పంచ్
* ఓ పక్క సమ్మెలు.... ఓ పక్క చెత్తను తొలగింపు
* సరిగా జీతాలు లేక బ్రతకడానికి భారం
* చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్న కార్యదర్శి,సర్పంచ్
* మాకు అన్యాయం జరుగుతుంది పంచాయతీ కార్మికులు
బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : పంచాయతీ కార్మికుల సంఘం ప్రతినిధిలు ఓ పక్క వేతనాలు పెంచాలి.పంచాయతీ కార్మికులను శాశ్వతంగా ఉద్యోగులుగా గుర్తించాలంటూ గత కొన్ని రోజులుగా సమ్మెలు జరుపుతున్నారు.ఓ పక్క గ్రామంలో ఉన్న చెత్తను తాత్కాలిక పనివాళ్లను ఏర్పాటు చేసి చెత్తను తొలిగిస్తున్నారు.ఈ ఘటన సోమవారం రోజున బషీరాబాద్ మండలం ఎక్మాయి గ్రామంలో జరిగింది.పంచాయతి కార్యదర్శి రవి మరియు సర్పంచ్ నారాయణ గ్రామంలో ఉన్న చెత్తను తాత్కాలిక పనివాళ్లను పెట్టి తొలగిస్తున్నారు.ఈ సంధర్బంగా పంచాయతీ కార్మికులు శమప్ప ,లక్ష్మి,నర్సప్ప వెళ్లి అడుగగా ఇష్టం వచినట్టుగా మాట్లాడారు.పంచాయతీ కార్మికులు మాట్లాడుతూ మాకు అన్యాయం జరుగుతుందాని బాధను వ్యక్త పర్చారు.గత కొన్ని రోజులుగా జీతాలు కూడా సరిగా వేయడం లేదు.మేము దినమంతా కష్టపడి పనిచేసిన సగం సగం జీతాలు వేస్తున్నారు.ఇప్పటి 5 నేలలు గడచినా జీతాలు సరిగా వేయడం లేదు ఎలా బ్రతకాలి అని బాధ పడుతున్నారు.జీతాలు ఎపుడు వేస్తారు అని అడుగా వాళ్లకు ఇష్టం వచినట్టుగా మాట్లాడుతున్నారు అని తెలిపారు.దయచేసి మండల అధికారులు ఎంపిడిఓ గారు మరియు అధికారులు వచ్చి విచారించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు.