గురుకుల పాఠశాలలో విద్యార్థిని మృతి పై విచారించాలి PDSU జిల్లా కమిటీ
* రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థిని మృతి
* సమగ్ర విచారణ జరపాలి
* వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ
* PDSU జిల్లా కమిటీ
వికారాబాద్ Vikarabad News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా కేంద్రంలో గల కొత్త గడిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న అనే విద్యార్థిని అనుమానస్పదంగా మృతి చెందడం చాలా బాధాకరమని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని PDSU ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాస్ ,కార్యదర్శి రాజేష్,జిల్లా కార్యదర్శి వై.గీత లు తెలియజేయడం జరిగింది.విద్యార్థిని మృతి పై సమగ్ర విచారణ జరపాలని గురుకుల పాఠశాలను అధికారులు వెంటనే సందర్శించాలని.సరైన మౌలిక వసతులు ఉన్నాయా లేదా అనేది కూడా పరిశీలించాలి.
కేవలం సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే అధికారులు స్పందించడం మిగతా సమయంలో కనీసం అటువైపు కూడా చూడలేకపోవడం శోచనీయమని తెలియజేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా హాస్టల్లో విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు వస్తే కనీసం ప్రాథమిక చికిత్స చేసే వాళ్ళు కూడా లేని హాస్టలు చాలా ఉన్నాయని, కావున ప్రభుత్వం వెంటనే స్పందించి అన్ని సంక్షేమ హాస్టల్లో, సాంఘిక గురుకులాల్లో ప్రాథమిక చికిత్స అందించే విధంగా విద్యార్థులకు అందుబాటులో ఉండాలని PDSU జిల్లా కమిటీ డిమాండ్ చేశారు.