ప్రజలు అత్యవసరం ఉంటేనే బయటకు రావాలి
* తహశీల్దార్ వెంకటస్వామి
* ఎంపీడీవో రమేష్
* ఎస్ఐ వేణు గోపాల్ గౌడ్
బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : బషీరాబాద్ మండలంలో పలు గ్రామలను సందర్శించిన మండల అధికారులు తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా ఎనిమిది రోజుల నుంచి కురుస్తున్న వర్షంతో బషీరాబాద్ మండల్ అధికారులు తహసిల్దార్ వెంకటస్వామి,ఎంపీడీవో రమేష్,ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్ అతి భారీ నుండి వర్షాలు పడే అవకాశం ఉన్నాయని జీవన్గి శ్రీ మహాదేవ లింగేశ్వర దేవాల ఉదృతంగా ప్రవహిస్తున్న కాగ్న నదిని, బషీరాబాద్ టు గంగ్వార్ కల్వర్టు, టాకి తాండ కల్వర్టు, మర్పల్లి నుండి జలాల్పూర్ కల్వర్డు నవల్గా సందర్భంలో వారు మాట్లాడుతూ గురువారం,శుక్రవారం రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలపడంతో ప్రజలు అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు.
వాగులు పొంగిపొర్లుతున్నాయి కాబట్టి పోలీస్ రెవెన్యూ పంచాయతీ విద్యుత్ శాఖ అధికారులు ముందు జాగ్రత్తతో ప్రజా ప్రతినిధులకు ప్రజలతో మాట్లాడడం జరుగుతుందని ప్రమాదకరమైన వాగుల దగ్గర పోలీస్ శాఖ ఇతర శాఖ అధికారులు కలిసి రోడ్లను బ్లాక్ చేసి బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు.చిన్నపిల్లలపై జాగ్రత్త ఉండాలి, పాత ఇండ్లు పాత నిర్మాణ కట్టడాల,కరెంటు స్తంభాల, దగ్గర జాగ్రత్త ఉండాలని ఏదైనా సమస్య ఉంటే వెంటనే అధికారులకు తెలియజేయాలని దయచేసి ప్రజలు ఎవరు బయటికి రావద్దు అత్యవసరం ఉంటేనే బయటకు రావాలని తెలిపారు.