హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపదీముర్మ
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : రాష్ట్రపతి ద్రౌపదీముర్ము హైదరాబాద్ చేరుకున్నారు.హకీంపేట విమానాశ్రయంలో గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు పలువురు రాష్ట్రమంత్రులు ఆమెకు స్వాగతం పలికారు.సాయంత్రం గచ్చిబౌలిలో నిర్వహించనున్న అల్లూరి సీతారామరాజు 125 వ జయంత్యుత్సవ ముగింపు కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొననున్నారు. ద్రౌపదీ ముర్ము హకీంపేట విమానాశ్రయం నుంచి నేరుగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. పర్యాటకుల సందర్శన తీరును రాష్ట్రపతి సమీక్షించనున్నారు. సాయంత్రం 5 గంటలకు హెలికాప్టర్‌లో గచ్చిబౌలి స్టేడియానికి ద్రౌపదీముర్ము చేరుకుని అల్లూరి జయంతి ఉత్సవాల కార్యక్రమంలో పాల్గొంటారు.