రంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం
రంగారెడ్డి Ranga Reddy News భారత్ ప్రతినిధి : రంగారెడ్డి జిల్లాలో మంగళవారం రోజున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది.ఇబ్రహీంపట్నం మండలం రాపోలు వద్ద ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టింది.ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను భానుప్రకాశ్, నవీన్, నారాయణరెడ్డిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.