సామజిక బాధ్యత కలిగి ఉండాలి
తాండూర్ Tandur News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో ఆదివారం రోజున మల్కాపూర్ గ్రామానికి చెందిన సామాజికవేత ప్రజా సమస్యలు తమ సమస్యలుగా ఎవరు కష్టాల్లో ఉన్న నేనున్నానంటూ భరోసా ఇస్తూ చనిపోయిన కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తూ. శుభ కార్యాల లోను తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ ప్రజల మన్ననను పొందుతున్న ఆర్సిగౌడ్ గారికి ఈరోజు పబ్లిక్ వాయిస్ ఫోరంగోర్ బంజారావెల్ఫేర్ అసోసియేషన్ పిడిఎస్యు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఆర్సిగౌడ్ తో పాటు అదే గ్రామానికి చెందిన షేక్ పటేల్ తాండూర్ మండల్ కో ఆప్షన్ శంషాద్దీన్ ను కూడా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా పబ్లిక్ వాయిస్ పబ్లిక్ వాయిస్ ఫోరం ప్రతినిధి జిలాని పిడిఎస్యు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పి శ్రీనివాస్ గోర్ బంజారావెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి అరుణ్ నాయక్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యత కలిగి ఉండాలని కష్టాల్లో ఉన్నటువంటి వాళ్లను ఆదుకునే తత్వం అలవర్చుకోవాలని వారు అన్నారు. ఆర్సిగౌడ్ గారి సేవలు అభినందనీయమని వారి యొక్క సేవలు గ్రామానికి పరిమితం కాకుండా మండలం నియోజకవర్గ స్థాయిలో కూడా విస్తరింప చేయాలని వారు ఆర్సిగౌడ్ గారిని విజ్ఞప్తి చేశారు. సముద్రంలో ఎన్ని నీళ్లు ఉన్నా త్రాగడానికి పనికి రావని అదేవిధంగా మనుషుల దగ్గర ఎన్ని కోట్లు ఉన్నా పేద ప్రజల కోసం ఖర్చుచేయకపోతే వేస్టే అని వారు అన్నారు. ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతను కలిగి ఉండాలని ఎదుటి వారి కష్టాలను తన వంతు సహాయ సహకారాలు అందించాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు మల్లు యాదవ్ అరుణ్ నాయక్ ఉపాధ్యాయులు మొహమ్మద్ కామాలోద్దీన్ గ్రామస్తులు మౌలానా తుల్జప్ప మల్లికార్జున్ రాజేందర్ రెడ్డి రఘు గౌడ్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం...
* ప్రతి గ్రామానికి వెళ్లి చైతన్యం చేస్తున్న ఎమ్మార్పీఎస్ నాయకులు ఇక్కడ క్లిక్ చేయండి
* బాధిత కుటుంబాన్ని పరామర్శించిన తాండూర్, ఎమ్మెల్యే, పైలట్ రోహిత్ రెడ్డి గారు ఇక్కడ క్లిక్ చేయండి
* గడప గడపకు కాంగ్రెస్ ఇక్కడ క్లిక్ చేయండి
* మొహరం వేడుకల్లో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఇక్కడ క్లిక్ చేయండి
* ఘనంగా బీఎస్పీ అరుణ్ రాజ్ గారి పుట్టినరోజు వేడుకలు ఇక్కడ క్లిక్ చేయండి
* సామజిక బాధ్యత కలిగి ఉండాలి ఇక్కడ క్లిక్ చేయండి