ఫోన్ ను అప్పగిస్తున్న ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్
* మొబైల్ ఫోన్ అప్పగింత
* మంతన్ గౌడ్ తండాకు చెందిన వ్యక్తి
బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలోని వివాహ వేడుకల్లో పోగొట్టుకున్న మొబైల్ బషీరాబాద్ ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్ బాధ్యుడికి మంగళవారం రోజున అప్పగించారు.ఎస్సై వేణుగోపాల్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం బషీరాబాద్ మండల పరిధిలోని మంతన్ గౌడ్ తండాలో ఓ వివాహానికి హాజరైన సోమ్లా భీమ్లా నాయక్ తన ఒప్పో మొబైల్ ని పోగొట్టుకున్నాడు.విషయాన్ని బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో గత 5వ నెలన ఫిర్యాదు చేశాడు.ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొబైల్ ను ట్రేస్ చేసి ఫిర్యాదుదారునికి తన మొబైల్ ను అపగ్గించారని ఎస్సె వేణుగోపాల్ గౌడ్ తెలిపారు.