సర్పంచ్ కూతురు ప్రేమ పెళ్లి చేసుకోకూడదా ?
* సర్పంచ్ కన్నా కూతురు పై కక్ష
* సర్పంచ్ తన అనుచరులతో ఇళ్లను దహనం
* సీపీని ఆశ్రయించిన ప్రేమ జంట
* మాకు ప్రాణహాని ఉంది
వరంగల్ Warangal News భారత్ ప్రతినిధి : వరంగల్ జిల్లా బుధవారం రోజున జిల్లా కేంద్రంలో నర్సంపేట మండలం ఇటుకాలపల్లిలో బీఆర్‌ఎస్ సర్పంచ్ రవీంద్ కుమార్తె ప్రేమ వివాహంతో చెలరేగిన ఉద్రిక్తత ఇంకా చల్లారని పరిస్థితి. సర్పంచ్ కూతురు కావ్యశ్రీ - రంజిత్ కులాంతర వివాహం చేసుకున్నారు. దీంతో రెచ్చిపోయిన సర్పంచ్ రవీందర్ తన అనుచరులతో కలిసి రంజిత్ ఇళ్లుతో సహా నాలుగు ఇళ్లను దహనం చేశారు.దీంతో తమకు ప్రాణభయం ఉందంటూ ప్రేమజంట కావ్యశ్రీ - రంజిత్. వరంగల్ పోలీస్ స్టేషన్ లో సీపీ రంగనాథ్‌ను ఆశ్రయించారు.ఈ సందర్భంగా ప్రేమజంట మీడియాతో మాట్లాడుతూ తండ్రి సర్పంచ్ రవీందర్ మాపై కక్ష కట్టారు.నిన్న సాయంత్రమే మమ్మల్ని చంపుతామని హెచ్చరించారు. మాకు ప్రాణహాని ఉంది పోలీసులే మాకు భద్రత కల్పించాలి. చావైనా, బ్రతుకైనా ఇద్దరం కలిసే ఉంటాం మాపై కక్ష సాధింపు కోసం మా స్నేహితుల ఇండ్లపై దాడులు చేయడం సబబుకాదు అని కావ్య అన్నారు.మా ఇంట్లో సర్టిఫికెట్లు, పది లక్షల రూపాయలు కాల్చి బూడిద చేశారు.ఐదున్నర తులాల బంగారం కూడా ఎత్తుకెళ్లారు. బీఆర్ఎస్ సర్పంచ్ రవీందర్‌తో ప్రాణభయం ఉంది అంటూ రంజిత్ వెల్లడించారు.